Breaking News

జమిలి ఎన్నికలపై లా కమిషన్‌ కీలక ప్రకటన.. 

Published on Fri, 09/29/2023 - 18:07

సాక్షి, ఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ప్లాన్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో జమిలి ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కాదని లా కమిషన్ తేల్చి చెప్పింది. దీంతో, 2024లో జమిలి ఎన్నికలు ఉండవని తెలుస్తోంది. ప్రతీసారిలాగే ఈసారి కూడా ఎన్నికలు జరుగనున్నాయి. 

అయితే, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే, 2024లో లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని లా కమిషన్‌ అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో 2029 నుంచి లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేలా లా కమిషన్‌ ఓ ఫార్ములా రూపొందిస్తున్నట్లు స్పష్టం చేసింది. వీటిపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ కసరత్తు మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

అలాగే, జ‌మిలి ఎన్నిక‌ల‌పై లా క‌మిష‌న్ నివేదిక 2024 లోక్‌స‌భ ఎన్నిక‌లలోగా ప్ర‌చురించే అవ‌కాశం ఉంద‌ని లా క‌మిష‌న్ చైర్మ‌న్ జ‌స్టిస్ రుతురాజ్ అవ‌స్ధి ఇటీవ‌ల వెల్ల‌డించారు. ఏక‌కాల ఎన్నిక‌ల‌పై క‌స‌రత్తు ఇంకా జ‌రుగుతున్నందున నివేదిక ప‌నులు ఇంకా కొన‌సాగుతున్నాయ‌ని చెప్పుకొచ్చారు. దేశంలో జ‌మిలి ఎన్నిక‌ల‌కు అవ‌స‌ర‌మైన రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌ల‌ను ఈ నివేదిక ప్ర‌భుత్వానికి సూచిస్తుంద‌ని తెలిపారు. ఇక, జమిలి ఎన్నికలపై లోతుగా చర్చించాలని కమిషన్‌ సూచించింది. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో 22వ లా క‌మిష‌న్ జ‌మిలి ఎన్నిక‌ల ప్ర‌తిపాద‌న‌పై జాతీయ రాజ‌కీయ పార్టీలు, ఈసీ, అధికారులు, విద్యావేత్త‌లు, నిపుణుల అభిప్రాయాలు కోరేందుకు ఆరు ప్ర‌శ్న‌ల‌ను రూపొందించింది.

ఇది కూడా చదవండి: ఇస్కాన్‌పై సంచలన ఆరోపణలు.. మేనకా గాంధీకి బిగ్‌ షాక్‌

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి