Breaking News

3 నిమిషాలకో మరణం!

Published on Sun, 11/09/2025 - 00:51

దాదాపు నిమిషానికో రోడ్డు ప్రమాదం.. మూడు నిమిషాలకు ఒక మరణం.. ఇదీ దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద సంఘటనల తీరు. వాహనాల సంఖ్యకు తగ్గట్టుగా రోడ్డు ప్రమాదాలే కాదు.. క్షతగాత్రులు, మృతుల సంఖ్య సైతం ఏటా పెరుగుతూనే ఉన్నాయి. 

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2023లో దేశంలో 4,80,583 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. వీటిలో 1.73 లక్షల మంది మరణించగా.. 4.62 లక్షల మంది గాయపడ్డారు. ప్రమాదాల్లో సుమారు 22 శాతం వర్షం, పొగమంచు లాంటి  ప్రతికూల వాతావరణంలో జరిగాయి. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

భారత్‌లో 2024–25లో అన్ని విభాగాల్లో కలిపి 2,56,07,391 కొత్త వాహనాలు రోడ్డెక్కాయి. అంతకు ముందు రెండు ఆర్థిక సంవత్సరాల్లో సైతం ఏటా 2 కోట్ల పైచిలుకు వెహికల్స్‌ రోడ్లపైకి వచ్చాయి. వాహనాల సంఖ్యకు తగ్గట్టే ప్రమాదాలూ  పెరుగుతున్నాయి. 

2023లో దేశవ్యాప్తంగా గంటకు సుమారు 55 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ప్రమాద మృతుల్లో ద్విచక్ర వాహనదారులు ఏకంగా 44.8 శాతం ఉన్నారు. పాదచారులది (20.4 శాతం) ఆ తరువాతి స్థానం. ఇక గుంతల కారణంగా జరిగిన 5,840 ప్రమాదాల్లో 2,161 మంది కన్నుమూశారు. 

ప్రతికూల వాతావరణంలో..
వాతావరణ పరిస్థితులు రోడ్డు ఉపరితల స్థితితోపాటు డ్రైవింగ్‌పైనా చూపుతాయి.  రోడ్డు స్పష్టంగా కనిపించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతాయి. భారీ వర్షం, దట్టమైన పొగమంచు, వడగళ్లు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు డ్రైవింగ్‌ను ప్రమాదకరంగా మారుస్తాయి. 

వర్షం.. పొగమంచు 

#

Tags : 1

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)