Breaking News

దివంగత నర్లీకర్‌కు విజ్ఞాన రత్న అవార్డ్‌ 

Published on Sun, 10/26/2025 - 06:22

న్యూఢిల్లీ: భారత్‌లో అత్యంత పేరుప్రఖ్యాతలు పొందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, దివంగత జయంత్‌ నర్లీకర్‌ను కేంద్ర ప్రభుత్వం శనివారం ‘విజ్ఞానరత్న పురస్కార్‌’తో గౌరవించింది. అంతర్జాతీయంగా ప్రాచుర్యంపొందిన విశ్వ ఆవిర్భావ ‘బిగ్‌బ్యాంగ్‌’ సిద్ధాంతంతో విబేధించి గతంలోనే ఈయన వార్తల్లోకెక్కారు. బ్రిటిష్‌ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఫ్రెడ్‌ హోలేతో కలిసి ఈయన కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 

విశ్వం అనేది మొదట్నుంచీ ఉందని అది ఎప్పటికప్పుడ కొత్త పదార్థాన్ని సృష్టించుకుంటూ విస్తరిస్తోందని నర్లీకర్‌ ప్రతిపాదించారు. 86 ఏళ్ల వయసులో మే 20వ తేదీన కన్నుమూయడం తెల్సిందే. సేవారంగంలో చేసిన విశేష కృషికి పద్మ అవార్డ్‌లు ఇచ్చినట్లే శాస్త్రసాంకేతిక రంగంలో దేశంలో అత్యున్నత అవార్డ్‌గా గత ఏడాది నుంచి విజ్ఞానరత్న పురస్కార్‌ను ప్రకటిస్తుంటడం తెల్సిందే. awards.gov.in  వెబ్‌సైట్‌లో పలు అవార్డ్‌ల విజేత వివరాలను కేంద్రప్రభుత్వం వెల్లడించింది. ఎనిమిది మందికి ‘విజ్ఞాన్‌ శ్రీ’, 14 మంది విజ్ఞాన్‌ యువ, ఒకరికి విజ్ఞాన్‌ టీమ్‌ అవార్డ్‌ను కేంద్రం ప్రకటించింది. 
 

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)