Breaking News

సింగపూర్‌లో లాలూ మనుమడు.. వృత్తి తెలిస్తే షాక్‌!

Published on Wed, 01/07/2026 - 13:12

పట్నా: బీహార్‌కు చెందిన రాజకీయ దిగ్గజం, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలు ప్రసాద్ యాదవ్ మనుమడు ఆదిత్య(18) సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాడు. లాలు కుమార్తె రోహిణీ ఆచార్య.. తన కుమారుడు, లాలు మనుమడు గురించి సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్న ఒక పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది.

తన కుమారుడు ఆదిత్య..  సింగపూర్‌లో రెండేళ్ల పాటు కొనసాగే ప్రాథమిక సైనిక శిక్షణ (బీఎంటీ)లో చేరుతున్నాడని రోహిణీ ఆచార్య తెలిపారు. తన కుమారుడు ఎంతో ధైర్యవంతుడని, అతనిని చూసినప్పుడు తన హృదయం గర్వంతో నిండిపోతుందని రోహిణి పేర్కొన్నారు. ప్రీ-యూనివర్సిటీ చదువు పూర్తి చేసిన తర్వాత, తన పెద్ద కుమారుడు ఆదిత్య దేశ సేవ కోసం కఠిన శిక్షణకు సిద్ధమయ్యాడని ఆమె ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.

తన కుమారుడిని ఉద్దేశించి రోహిణి అతనిని ఉత్సాహపరిచే వ్యాఖ్యలు చేశారు. ‘ఆదిత్యా.. నువ్వు ఎంతో ధైర్యవంతుడివి, క్రమశిక్షణ గలవాడివి. వెళ్లు.. నీ సత్తా చాటుకో. జీవితంలో ఎదురయ్యే అత్యంత కఠినమైన పోరాటాల్లోనే నిజమైన వీరులు తయారవుతారని ఎప్పుడూ గుర్తుంచుకో’ అంటూ ఆమె దీవించారు. మా ప్రేమ, ప్రోత్సాహం నీకు ఎల్లప్పుడూ ఉంటాయని ఆమె ఆ పోస్ట్‌లో రాశారు. లాలు ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి దంపతుల తొమ్మిది మంది సంతానంలో రెండో కుమార్తె అయిన రోహిణీ ఆచార్య,  సమరేష్ సింగ్‌ను వివాహం చేసుకున్నారు. వీరి పెద్ద కుమారుడే ఆదిత్య.
 

సింగపూర్ జాతీయ సేవా (National Service) విధానంలో భాగంగా ఆదిత్య ఈ ప్రాథమిక సైనిక శిక్షణ (బీఎంటీ)లో చేరారు. ఇది యువకుల్లో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, పట్టుదల, బృంద స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి తోడ్పడుతుంది. ఈ శిక్షణలో  అభ్యర్థులు కఠినమైన శారీరక వ్యాయామాలు, ఆయుధాలను వాడటం మొదలైనవి నేర్చుకుంటారు. రెండేళ్ల శిక్షణ తరువాత వారి ర్యాంకును  అనుసరించి వారికి 50 ఏళ్ల వయస్సు వచ్చే వరకు రిజర్విస్ట్ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. సింగపూర్ చట్టాల ప్రకారం, 18 ఏళ్లు నిండిన ప్రతి  యువకుడు రెండేళ్ల పాటు జాతీయ సేవ (National Service)లో శిక్షణ పొందాలి. ఇది అక్కడి చట్టం ప్రకారం తప్పనిసరి. ఆదిత్య సింగపూర్‌లో నివసిస్తున్నందున, అక్కడి నిబంధనలను అనుసరించి ఈ శిక్షణలో చేరారు.

ఇది కూడా చదవండి: 16 ఏళ్ల ఏఐ నిపుణునితో థరూర్‌ ఏమన్నారంటే..

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు