Breaking News

‘ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌’ కేసులో ఈడీ విచారణకు లాలూ

Published on Wed, 03/19/2025 - 12:02

పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్(RJD chief Lalu Yadav) మరోమారు చిక్కుల్లో పడ్డారు. ‘ల్యాండ్‌ ఫర్‌​ జాబ్‌’ కేసులో విచారణను ఎదుర్కొనేందుకు ఆయన తన కుమార్తె మిసా భారతితో కలిసి బుధవారం పట్నా(బీహార్‌)లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

మరోవైపు లాలూ యాదవ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారించడాన్ని నిరసిస్తూ ఈడీ కార్యాలయం వెలుపల ఆర్జేడీ నేతలు, కార్యకర్తలు  ఆందోళనకు దిగారు. ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌ కేసును లాలూ గతంలో రైల్వే మంత్రిగా ఉన్నప్పటి నుంచి  ఎదుర్కొంటున్నారు. 2024 నుండి 2009 వరకు రైల్వే మంత్రిగా పనిచేసిన కాలంలో లాలూ పలువురికి ఉద్యోగాలు ఇప్పించి, అందుకు ‍ప్రతిగా వారి భూములను తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మనీలాండరింగ్ కేసులో లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి, ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌(Tej Pratap Yadav)లు మంగళవారం ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు.

దాదాపు 14 నెలల తర్వాత ఈ కేసులో లాలూ యాదవ్ విచారణకు ఈడీ ముందు హాజరయ్యారు. ఈడీ 2024, జనవరి 20 న లాలూ యాదవ్ వాంగ్మూలాన్ని నమోదు చేయగా, గత ఏడాది జనవరి 30న తేజస్వి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసింది. అప్పుడు కూడా ఆర్జేడీ నేతలు ఈడీ విచారణకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. మరోవైపు దర్యాప్తులో తమ కుటుంబం పూర్తిగా ఈడీకి సహకరిస్తోందని లాలూ కుమార్తె, పాటలీపుత్ర ఎంపీ మిసా భారతి తెలిపారు.

‘ల్యాండ్‌ ఫర​ జాబ్‌’ కేసును ఈడీతోపాటు సీబీఐ కూడా దర్యాప్తు చేస్తోంది. సీబీఐ 2022 మే 18న ఈ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో ఈడీ గత ఏడాది చార్జిషీట్ దాఖలు చేసింది. ఈడీ కేసులో లాలూ, రబ్రీ, వారి ఇద్దరు కుమార్తెలు సహా మొత్తం 11 మంది నిందితులుగా ఉండగా, సీబీఐ మొత్తం 78 మందిని నిందితులుగా చేర్చింది. రెండు కేసుల్లో లాలూ కుటుంబానికి కోర్టు నుండి బెయిల్ లభించింది.

ఇది కూడా చదవండి: Sunita Williams: నాటి సెల్ఫీని షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి