Breaking News

ఎయిమ్స్‌లో లాలూకు కొనసాగుతున్న చికిత్స

Published on Thu, 04/03/2025 - 10:50

న్యూఢిల్లీ: ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. లాలూ ప్రసాద్‌ వీపు, చేతులపై పుండ్లు పడినట్లు సమాచారం. దీంతో బుధవారం రాత్రి ఆయన్ని కార్డియో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌(CCU)కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 

వైద్య బృందం ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.  ప్రస్తుతం లాలూ వెంట ఆయన సతీమణి రబ్రీదేవి ఉన్నారు.  వాస్తవానికి.. బుధవారం ఆయన ఢిల్లీకి బయలుదేరినప్పటికీ.. విమానాశ్రయానికి చేరుకోగానే ఒక్కసారిగా రక్తపోటులో తేడా కనిపించింది. దీంతో వెంటనే పాట్నాలోని పరాస్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కోలుకున్న అనంతరం ఢిల్లీ తరలించారు.

లాలూ ఆరోగ్యంపై ఆయన తనయుడు, బిహార్‌ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ స్పందించారు. పరాస్‌ ఆసుపత్రి నుంచి లాలూను తొలుత ఎయిర్‌ అంబులెన్స్‌లో ఎయిమ్స్‌కు తరలించాలని అనుకున్నట్లు తెలిపారు. అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ప్రయాణికుల విమానంలో వెళ్తానని చెప్పడంతో తీసుకెళ్లినట్లు చెప్పారు. తన తండ్రి చాలా ధైర్యవంతుడన్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని తేజస్వి అంటున్నారు. 

76 ఏళ్ల చాలా ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతుండడంతో ఇప్పటికే గుండె, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. గత ఏడాది జూలైలో ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొంది కోలుకున్నారు.

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)