Breaking News

రాహుల్ గాంధీని కోర్టుకు ఈడుస్తా.. కాంగ్రెస్‌ నేతపై లలిత్ మోదీ ఫైర్..

Published on Thu, 03/30/2023 - 15:18

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ. ఆయనపై లండన్ కోర్టులో కేసు పెడతానని చెప్పారు. మోదీ ఇంటిపేరుపై రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో సూరత్ కోర్టు ఆయనను దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. దేశంలోని దొంగల ఇంటిపేరు మోదీనే అని ఎందుకు ఉందని రాహుల్ 2019 ఎన్నికల సందర్భంగా వ్యాఖ్యానించారు.

అయితే తాను ఇప్పటివరకు ఏ కేసులోనూ దోషిగా తేలలేదని, అలాంటప్పుడు దేశం వీడిపోయిన ఆర్థిక నేరగాడు అని ఎలా అంటారని లలిత్ మోదీ ప్రశ్నించారు. రాహుల్ అనుచరులు, కాంగ్రెస్ నేతలు ఏ ఆధారాలతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. రాహుల్‌పై యూకే కోర్టులో కేసు పెడతానని, ఆయన న్యాయస్థానం ముందు హాజరుకావాల్సిందేనని పేర్కొన్నారు. ఈమేరకు లలిత్ మోదీ ట్విట్టర్‌లో వరుస ట్వీట్‌లు చేసి రాహుల్, కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు.

'పప్పు అనబడే రాహుల్ గాంధీ నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఓ కేసులో దోషిగా తేలారు. నేను మాత్రం గత 15 ఏళ్లలలో ఏ కేసులోనూ దోషిగా తేలలేదు అలాంటప్పుడు నన్ను నేరగాడు అని ఎలా అంటారు. నేనొక సాధారణ వ్యక్తిని. 100 బిలియన్ డాలర్లు విలువ చేసే అతిపెద్ద క్రీడా కార్యక్రమానికి ఆధ్యుడిని.'  అని లలిత్ మోదీ ట్వీట్ చేశారు.

చదవండి: సీబీఐ అప్పుడు నాపై ఎంతో ఒత్తిడి చేసింది: అమిత్‌ షా

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)