Breaking News

Lal Bhadur Shastri: నాటి ప్రధాని అభ్యర్థనతో దేశమంతా ఉపవాసం

Published on Sat, 01/11/2025 - 07:53

దేశానికి సేవలు అందించిన మహనీయులను స్మరించుకోవడం దేశవాసులుగా మన కర్తవ్యం. ఈరోజు (జనవరి 11) భారతదేశ రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి వర్థంతి. 1966 జనవరి 11న ఆయన కన్నుమూశారు. ఆడంబరాలకు దూరంగా ఉండే వ్యక్తిగా శాస్త్రి పేరుగాంచారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మరణానంతరం శాస్త్రి 1964, జూన్ 9న ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

18 నెలల పాటు దేశ ప్రధానమంత్రిగా కొనసాగిన శాస్త్రి నాయకత్వాన 1965లో భారత్-పాక్‌ మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పాక్‌ ఘోరపరాజయాన్ని ఎదుర్కొంది. పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌తో తాష్కెంట్‌(Tashkent)లో యుద్ధాన్ని ముగించే ఒప్పందంపై శాస్త్రి సంతకం చేశారు. ఆ తర్వాత 1966, జనవరి 11న రాత్రి ఆయన అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూశారు. ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి పదవీకాలం చాలా తక్కువ. కానీ అదే సమయంలో ఆయన తన సరళమైన స్వభావం, దృఢ సంకల్ప శక్తి ప్రభావాలను దేశప్రజలకు చాటిచూపారు. క్లిష్ట సమయంలో దేశంలో అధికారాన్ని చేపట్టిన ఆయన పలు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు.

లాల్ బహదూర్ శాస్త్రి(Lal Bahadur Shastri) 1964, జూన్ నుండి 1966, జనవరి వరకు భారత ప్రధానిగా ఉన్నారు. ఆ సమయంలో భారతదేశంలో ఆహారధాన్యాల కొరత అధికంగా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో భారత్‌ ఆహార ధాన్యాల కోసం అమెరికాపై ఆధారపడింది. ఇంతలో 1965లో పాకిస్తాన్.. భారతదేశంపై దాడికి దిగింది. అయితే పాక్‌కు  భారత సైన్యం(Indian Army) తగిన సమాధానం ఇచ్చింది. కానీ  మన సైనికులకు తీవ్ర ఆహార సమస్య ఏర్పడింది. అటువంటి పరిస్థితిలో ప్రధాని శాస్త్రి.. దేశ ప్రజలంతా ఒక  ఉపవాసం ఉండాలని విజ్ఞప్తి చేశారు. దీనికి దేశ ప్రజలంతా అంగీకరించారు. ఆ తదుపరి సంవత్సరాల్లో భారత్‌ ఆహార ఉత్పత్తుల విషయంలో స్వయం సమృద్ధిని సాధించింది.

ఇది కూడా చదవండి: Mahakumbh-2025: అంబాసిడర్‌ బాబా.. 35 ఏళ్లుగా కారులోనే సాధన

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)