Breaking News

ప్రధానిగా ఉంటూ కుమారుని ప్రమోషన్‌ అడ్డుకున్న శాస్త్రి

Published on Wed, 10/02/2024 - 13:13

నేడు ఇద్దరు మహనీయుల పుట్టినరోజు. మహాత్మా గాంధీతో పాటు భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కూడా  అక్టోబర్‌ 2నే జన్మించారు. శాస్త్రి 1904 అక్టోబర్ 2న యూపీలోని మొగల్‌సరాయ్‌లో జన్మించారు. శాస్త్రి తన జీవితాంతం సామాన్యుల అభివృద్ధికి పాటుపడ్డారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో శాస్త్రి ప్రధాన పాత్ర పోషించారు. నెహ్రూ తర్వాత భారతదేశానికి మూడవ ప్రధానమంత్రిగా శాస్త్రి బాధ్యతలు స్వీకరించారు.

అవినీతికి వ్యతిరేకంగా లాల్ బహదూర్ శాస్త్రి  తీసుకున్న నిర్ణయాలు అతనిలోని నిజాయితీని ప్రతిబింబిస్తాయి.  శాస్త్రిలోని వినయపూర్వక స్వభావం, సరళత్వం, నిజాయితీ, దేశభక్తి  అందరికీ స్ఫూర్తినందిస్తాయి. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు తన కుమారుని ప్రమోషన్‌ను నిలిపివేశారు. తన కుమారుడు అక్రమంగా ఉద్యోగంలో పదోన్నతి పొందేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న శాస్త్రి అందుకు అడ్డుపడ్డారు. కుమారునికి పదోన్నతి కల్పించిన అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని నాటి తరం నేతలు చెబుతుంటారు.

లాల్ బహదూర్ శాస్త్రి  కేంద్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు ఏదో ప్రభుత్వ పనిమీద కలకత్తా వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆయన కారు ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకుంది. కొద్దిసేపటిలో ఆయన డిల్లికి వెళ్లాల్సిన ఫ్లైట్‌ ఉంది. ఈ పరిస్థితిని గమనించిన నాటి పోలీస్‌ కమిషనర్‌ ఒక ఐడియా చెప్పారు. శాస్త్రి ప్రయాణిస్తున్న కారుకు సైరన్‌తో కూడిన ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేస్తానన్నారు. అయితే శాస్త్రి అందుకు నిరాకరించారు. అలా చేస్తే సామాన్యులకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు. 

ఇది కూడా చదవండి: గాంధీ చెప్పే మూడు కోతుల కథ వెనుక..

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)