Breaking News

మహాశివరాత్రి: కాశీలో భక్తుల రద్దీ.. ఈ ఏడాది ప్రత్యేకతలివే..

Published on Sun, 02/15/2026 - 08:17

వారణాసి: నేడు(ఆదివారం) మహాశివరాత్రి సందర్భంగా వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. ఈ ఏడాది మహాదేవుని సన్నిధిలో 26 గంటల పాటు నిరంతర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పండితులు ప్రత్యేక అభిషేకాలను నిర్వహిస్తున్నారు. లక్షలాది మంది భక్తులు కాశీకి తరలివస్తున్నారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారణాసి జిల్లా యంత్రాంగం ఆలయ కమిటీ హై అలర్ట్ ప్రకటించాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన లైన్లను క్రమబద్ధీకరించడంతో పాటు, భారీ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. గంగా ఘాట్‌ల వద్ద ప్రత్యేక నిఘాను పెంచిన అధికారులు.. వేడుకలు శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ పరిసరాల్లో నిరంతరాయంగా పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచారు.
 

గంగా నది తీరాన కొలువై ఉన్న పురాతన కాశీ నగరాన్ని సాక్షాత్తు ఆ పరమశివుడి నివాసంగా, మోక్ష ప్రాప్తికి ప్రధాన కేంద్రంగా భక్తులు విశ్వసిస్తారు. హిందూ సంస్కృతిలో మహాశివరాత్రికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర దినమే సృష్టి ఆరంభమైందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పౌరాణిక కథల ప్రకారం పరమశివుడు ఇదే రోజున మహాగ్నిలింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అలాగే లోక కళ్యాణం కోసం శివపార్వతుల వివాహం జరిగిన అద్భుత ఘట్టం కూడా ఈ రోజేనని  చెబుతుంటారు. అందుకే శివభక్తులు ఈ రాత్రంతా జాగరణ చేస్తూ, అభిషేకాలతో భోళాశంకరుడిని కొలుస్తారు.

ఉజ్జయినిలో వైభవంగా భస్మ హారతి
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గల మహాకాళేశ్వర ఆలయంలో తెల్లవారుజామున 3 గంటలకే అర్చకులు పవిత్ర పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనెతో స్వామివారికి అభిషేకం చేసిన అనంతరం, గంధం, సుగంధ ద్రవ్యాలతో అలంకరించారు. ఆపై మహాకాళుడికి తెల్లని వస్త్రాలను ధరింపజేసి,  అత్యంత ప్రీతిపాత్రమైన ‘విజయ’ అలంకారం చేశారు. శంఖారావాల మధ్య భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ ‘భస్మ హారతి’ని కళ్లారా వీక్షించేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ తలుపులను 44 గంటల పాటు తెరిచి ఉంచనున్నారు. ఈ పర్వదినం సందర్భంగా సుమారు 10 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు. భారీగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, భద్రత, క్యూ లైన్ల నిర్వహణ కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉజ్జయినిలో మహాశివరాత్రికి ముందు తొమ్మిది రోజుల పాటు ‘శివ నవరాత్రి మహోత్సవాలు’ అత్యంత వైభవంగా నిర్వహిస్తునన్నారు. శివరాత్రి మరుసటి రోజున స్వామివారికి ‘సెహ్రా’ అలంకరించి భస్మ హారతిని నిర్వహిస్తారు. 


ఇది కూడా చదవండి: Bangladesh: తారిఖ్‌ రెహ్మాన్‌ ప్రమాణానికి ప్రధాని మోదీకి ఆహ్వానం

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)