Breaking News

నోయిడా హత్య కేసు.. లేడీ డాన్ అరెస్ట్

Published on Wed, 09/18/2024 - 20:14

ఢిల్లీ: సంచలనం సృష్టించిన ఎయిర్‌ ఇండియా ఉద్యోగి సూరజ్ మాన్ హత్య కేసులో ఎట్టకేలకు లేడీ డాన్ కాజల్ ఖత్రీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నోయిడాలో ఈ ఏడాది జనవరి 19న ఎయిర్ ఇండియా ఉద్యోగి సూరజ్ మాన్ కారులోనే హత్యకు గురైన సంగతి తెలిసిందే. బైక్‌పై వచ్చిన హంతకుల ముఠా కాల్పులు జరిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. 8 నెలల తర్వాత కీలక పురోగతి సాధించారు. ఈ హత్య వెనుక ఢిల్లీ లేడీ డాన్ కాజల్ ఖత్రీ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. గ్యాంగ్‌స్టర్ కపిల్ మాన్ ఆదేశాల మేరకే ఈ హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు.

బాధితుడు సూరజ్ మాన్.. గ్యాంగ్‌స్టర్ పర్వేష్ మాన్ సోదరుడు. కపిల్ మాన్.. పర్వేష్ మాన్ మధ్య ఎప్పటి నుంచో శత్రుత్వం ఉంది. తన తండ్రిని పర్వేష్ మాన్‌ హత్య చేశాడంటూ కపిల్ మాన్ పగ పెంచుకున్నాడు. దీంతో తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు పర్వేష్ మాన్ సోదరుడు సూరజ్ మాన్ హత్యకు ప్లాన్‌ వేశాడు.

ఇదీ చదవండి: చెప్పులు వేసుకుని రావద్దన్న‌ డాక్టర్‌పై దాడి.. వీడియో వైరల్‌

అయితే, తన భార్య అయిన.. లేడీ డాన్ కాజల్ ఖత్రీ సాయంతో ప్రణాళిక అమలు చేశాడు. కాగా, కపిల్ మాన్, పర్వేష్ మాన్ ఇద్దరూ ఢిల్లీలోని మండోలి జైల్లోనే ఉన్నారు. కాజల్ ఖత్రీ తలపై రూ.25 వేలు పారితోషికం ఉందని ఢిల్లీ పోలీసు అధికారి సంజయ్ భాటియా వెల్లడించారు. నోయిడాలో హత్యకు గురైన సూరజ్ మాన్ కేసులో కాజల్‌ను అరెస్ట్ చేసి నోయిడా పోలీసులకు అప్పగించినట్లు ఆయన వెల్లడించారు.

 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)