Breaking News

నా భర్తకు మహిళల పిచ్చి.. 30 మందితో సంబంధాలు..

Published on Mon, 08/18/2025 - 12:56

తమిళనాడు: వివాహమైన 10 నెలలలోనే ఓ మహిళా డాక్టర్‌ ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. చెన్నై కోడంబాక్కంలో అద్దెకు గది తీసుకుని నివసిస్తున్న జ్యోతిశ్వరి ( 30). ఈమె ఎం.బి.బి.ఎస్, ఎం.ఎస్‌. చదివింది. ఆమె స్వస్థలం రామనాథపురం. ఈమె మీనంబాక్కంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తోంది. ఈమెకు రామనాథపురానికి చెందిన యోతీశ్వరన్‌ (34)తో గత సంవత్సరం నవంబర్‌లో వివాహం జరిగింది. ఇంజినీరైన యోతీశ్వరన్‌  దురైపాక్కంలోని ఓ ప్రైవేట్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. 

ఈ క్రమంలో భార్యభర్తల మధ్య గొడవలు  ప్రారంభమయ్యాయి. దీంతో యోతీశ్వరన్‌  తన భార్యను విడిచిపెట్టి తన స్వస్థలానికి వెళ్లి ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడూ భార్యను చూడటానికి వచ్చి వెళ్లేవాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో  వరుసగా మూడు రోజులు  సెలవు కావడంతో పెరుంగళత్తూరు శ్రీరామ్‌ గేట్‌లో 12 అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న తన సోదరి ముత్తులక్ష్మి ఇంటికి  జ్యోతిశ్వరి వెళ్లింది. 

ఆ తర్వాత సాయంత్రం తన ఇంటికి బయలుదేరింది. అపార్ట్‌మెంట్‌ ’లిఫ్ట్‌’లోకి వెళ్లిన జ్యోతిశ్వరి, కిందకు వెళ్లకుండా పైకి వెళ్లింది. టెరస్ర్‌కు వెళ్లి తన చెప్పులు, హ్యాండ్‌బ్యాగ్‌ తీసివేసి 12వ అంతస్తు నుంచి కిందకు దూకింది. ఇందులో, తలకు. తీవ్రంగా గాయపడిన జ్యోతిశ్వరి సంఘటన స్థలంలోనే దారుణంగా మృతి చెందింది . ఈ విషయం తెలుసుకున్న పీర్కన్‌కరణై పోలీసులు ఆత్మహత్య చేసుకున్న జ్యోతిశ్వరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

భర్త అరాచకాలు భరించలేకనే..? 
కాగా గత నవంబర్‌ నెలలో  తల్లిదండ్రులు చూసిన వరుడు యోతీశ్వరన్‌ను మనస్ఫూర్తిగా ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే, యోతీశ్వరన్‌ తన భార్యకు ప్రాధాన్యత ఇవ్వకుండా గంజాయితో పాటూ అనేక ఇతర చెడు అలవాట్లలో మునిగిపోయాడు. అంతేకాకుండా, డేటింగ్‌ యాప్‌ ద్వారా 30 మందికి పైగా మహిళలతో పరిచయం పెంచుకుని, పెళ్లయిన తర్వాత కూడా వారితో సంబంధాలు కొనసాగించాడు.

 కాగా ఎంతో ఆశతో పెళ్లి చేసుకున్న భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని తెలుసుకున్న జ్యోతీశ్వరి, తన భర్త ల్యాప్‌టాప్‌ను పరిశీలించగా, అతను అనేక మంది మహిళలతో సంబంధాలు పెట్టుకున్న విషయం తెలిసి మనోవేదకు గురైంది. ఈ నేపథ్యంలో, కోడంబాక్కంలోని తన తల్లితో కలిసి గది తీసుకుని ఉంటున్న జ్యోతీశ్వరి, పెరుంగళత్తూరులోని అక్క ఇంటికి వెళ్లినప్పుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)