Breaking News

నాటి ‘భగీరథుడు’ నేడు ‘గౌరి’ రూపంలో వచ్చాడా?

Published on Thu, 02/08/2024 - 08:16

మహిళలు.. పురుషుల కంటే తక్కువని ఎవరన్నారు?.. ‘గౌరి’ గురించి తెలిస్తే ఇటువంటి మాటలు మాట్లాడేవారు ఇక జన్మలో ఎప్పటికీ స్త్రీలను తక్కువగా చూడరు. నింగినున్న గంగను భూమిపైకి తెచ్చిన భగీరథుని గురించి మనకు తెలుసు. కొండను తవ్వి రోడ్డును వేసిన బీహార్‌కు చెందిన దర్శత్ మాఝీ గురించి కూడా మనం వినేవుంటాం. అంతటి స్థాయిని దక్కించుకున్న ‘గౌరి’ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

కర్ణాటకకు చెందిన ‘గౌరి’ నీటి ఎద్దడిని  పరిష్కరించడంలో నిపుణురాలిగా పేరు తెచ్చుకుంది. ఈమె ఇప్పటి వరకు రెండు బావులను తవ్వి, ఇప్పుడు మూడో బావిని తవ్వడం మొదలు పెట్టింది. స్థానికులు ఆమెను అపర భగీరథ అని అభివర్ణిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఉత్తర కన్నడ జిల్లాలోని గణేష్ నగర్‌కు చెందిన 55 ఏళ్ల మహిళ అంగన్‌వాడీలకు వచ్చే పిల్లలు దాహంతో అలమటించకూడదనే ఉద్దేశంతో స్వయంగా బావిని తవ్వడం ప్రారంభించింది. 

గౌరి చంద్రశేఖర్ నాయక్ తన ఇంటి సమీపంలోని అంగన్ వాడీ కేంద్రం వద్ద నాలుగు అడుగుల వెడల్పు  కలిగిన బావిని తవ్వే పనిని వారం రోజుల క్రితం ప్రారంభించింది. రోజూ ఒకటిన్నర అడుగుల లోతు తవ్వుతూ వస్తోంది. పలుగు, పార, బుట్ట, తాడు మొదలైన వస్తువుల సాయంతో ఆమె  మట్టిని బయటకు తోడుతోంది. అంగన్ వాడీకి మంచి నీటి సౌకర్యం కల్పించేందుకు నెల రోజుల్లో బావిని సిద్ధం చేయాలని ‘గౌరి’ లక్ష్యంగా పెట్టుకుంది.

బావిని తవ్వడం వెనుక తనకు కలిగిన స్ఫూర్తి గురించి గౌరి చంద్రశేఖర్ నాయక్ మాట్లాడుతూ ‘గణేష్ నగర్‌లో నీటి కొరత ఉంది. అంగన్‌వాడీలకు వచ్చే చిన్నారులకు తాగునీరు లేదు. దాహం తీర్చుకునేందుకు పిల్లలు చాలా కష్టపడాల్సి వస్తోంది. ఇటువంటి దుర్భర పరిస్థితే నాలో బావులు తవ్వేందుకు ప్రేరణ కల్పించింది’ అని పేర్కొంది. గౌరి బావిని తవ్వడం ఇదేమీ మొదటి సారికాదు. 2017, 2018లో రెండు బావులు తవ్వింది. జనం తాగునీటికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఆమె ఇటువంటి మంచి పని చేస్తోంది.  

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)