Breaking News

22న లద్దాఖ్‌ ప్రతినిధులతో కేంద్రం భేటీ

Published on Mon, 10/20/2025 - 05:08

లేహ్‌: ఈ నెల 22వ తేదీన కేంద్ర ప్రభుత్వం లద్దాఖ్‌ ప్రతినిధులతో చర్చలు జరపనుంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ సారథ్యంలో ఏర్పాటైన ఉప సంఘం ఢిల్లీలో లేహ్‌ అపెక్స్‌ బాడీ(ఎల్‌ఏబీ), కార్గిల్‌ డెమోక్రాటిక్‌ అలయెన్స్‌(కేడీఏ) ప్రతినిధులతోపాటు లద్దాఖ్‌ ఎంపీ మహ్మద్‌ హనీఫా జాన్‌తో సమావేశం కానుందని ఎల్‌ఏబీ సహాధ్యక్షుడు చెరింగ్‌ డోర్జె లక్రుక్‌ ఆదివారం వెల్లడించారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించడం, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చడంపైనే ప్రధానంగా చర్చలు జరుగుతాయని లక్రుక్‌ మీడియాకు వివరించారు.

 తమను కేంద్రం చర్చలకు ఆహ్వానించడాన్ని ఆయన స్వాగతించారు. చర్చలతో సానుకూల ఫలితం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలనే డిమాండ్‌తో ఎల్‌ఏబీ సెప్టెంబర్‌ 24వ చేపట్టిన బంద్‌ హింసాత్మకంగా మారడం. ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ను అధికారులు జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్‌ చేయడం తెల్సిందే. కాగా, తనతోపాటు ఎల్‌ఏబీ లీగల్‌ అడ్వైజర్, అంజుమన్‌ ఇమామియా అధ్యక్షుడు అఫ్రాఫ్‌ అలీ బర్చా, కేడీఏ తరఫున మరో ముగ్గురు చర్చల్లో పాల్గొంటారని లక్రుక్‌ వివరించారు. 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)