Breaking News

నిద్రతో పేగుబంధం

Published on Sun, 06/07/2026 - 01:31

మంచినిద్ర లేకపోతే పొట్ట పనిచేయదు... నిజమే నిద్రకు, పేగు ఆరోగ్యా­నికి మధ్య సంబంధం ఉంది. దీన్ని గట్‌–స్లీప్‌ యాక్సిస్‌ అంటారు. పేగు­లోని బ్యాక్టీరియా మనం నిద్రపోవడానికి అనువైన రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. సుఖ నిద్రతో దేహంలోని మైక్రోబయోమ్‌ యంత్రాంగం చక్కగా పనిచేసి దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అమెరికాకు చెందిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ ఇన్‌ఫర్మేషన్‌ (ఎన్‌సీబీఐ) ప్రకారం మంచి నిద్ర–జీర్ణకోశ ఆరోగ్యం పరస్పర ఆధారితాలు.

యంత్రం పనిచేయాలంటే..
మన జీర్ణ వ్యవస్థలో సూక్ష్మజీవులు నివసిస్తాయి. ఆ సముదాయాన్ని, వాటి జన్యు పదార్థం, ఫంగస్‌లను మైక్రోబయోమ్‌ అంటారు. ఇది జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తికి దోహదం చేస్తూ మనిషి ఆరోగ్యంగా జీవించడానికి దోహదపడుతుంది. ఈ మైక్రోబయోమ్‌ చక్రం సవ్యంగా సాగాలంటే మంచి నిద్ర అవసరం.

మంచినిద్ర లేకపోతే...
⇒ పేగులో ఉండే ప్రో–బ్యాక్టీరియా (దేహానికి ప్రయోజనకారి) వృద్ధి తగ్గుతుంది. ప్రో–బ్యాక్టీరియా వృద్ధి తగ్గిందంటే హానికారక బ్యాక్టీరియా వృద్ధిపై నియంత్రణ లేకపోవడంతో ఆ బ్యాక్టీరియా పెరిగిపోతుంది. ఈ స్థితిని డిస్‌బయోసిస్‌ అంటారు.
⇒ గాఢనిద్రలో ఉన్నప్పుడు విడుదల కావాల్సిన గ్రెలిన్, లెప్టిన్‌ హార్మోన్ల సమతుల్యత నిద్రలేమి కారణంగా దెబ్బతింటుంది.
⇒ జీవక్రియలు మందగించడం ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌కు దారితీస్తుంది.

శరీరంలో ఉత్పత్తి అయ్యే 90% సెరోటోనిన్‌ హార్మోన్‌ పేగులోనే ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్‌ న్యూరో ట్రాన్స్‌మీటర్‌గా పనిచేస్తుంది. మానసిక స్థితి, నిద్రను ప్రభావితం చేస్తుంది. ఇది మెలటోనిన్‌ హార్మోన్‌కు ముందస్తు దశగా చెప్పవచ్చు. నిద్రపట్టడం, మెలకువ రావడం అనే ప్రక్రియలను మెలటో­నిన్‌ నియంత్రిస్తుంది. పేగు ఆరోగ్యం సరిగా లేకపోతే ఈ ప్రక్రియలో అవరోధాలు ఏర్పడతాయి. అంటే మనం మంచిగా నిద్రపోతేనే జీర్ణవ్యవస్థ తన పనిని చక్కగా నిర్వర్తిస్తుంది. జీర్ణవ్యవస్థ సరిగా పనిచేస్తేనే నిద్ర పడుతుంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)