Breaking News

టీఎంసీలో వర్గపోరు.. కీలక నేత రాజీనామా?

Published on Sat, 03/02/2024 - 07:24

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ)లో కీలక నేత కునాల్ ఘోష్ రాజీనామా చేశారు. కునాల్‌కు అదే పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత సుదీప్ బందోపాధ్యాయ మధ్య  గత కొన్ని నెలలుగా వివాదం నడుస్తోంది. దాని పరిణామం ఇప్పుడు బయటపడింది. 

మార్చి 10న కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో మమతా బెనర్జీ మెగా ర్యాలీ నిర్వహించనున్నారు. దీనికి సన్నాహాలు చేసేందుకు సుదీప్ ఇటీవల కోల్‌కతాలో టీఎంసీ నేతలతో సమావేశమయ్యారు. అయితే దీనికి ఆయన కునాల్ ఘోష్‌ను ఆహ్వానించలేదు. దీంతో కునాల్ ఘోష్.. సుదీప్‌ పేరు ప్రస్తవించకుండా ట్విట్టర్‌లో ఆయనపై విమర్శల దాడి చేసారు. ‘ఆ నేత అసమర్థుడు. గ్రూపులను నడిపే నేత, స్వార్థపరుడు. ఏడాది పొడుగునా చిల్లర రాజకీయాలు చేసి, ఎన్నికలకు ముందు ‘దీదీ అభిషేకం’ పేరుతో, పార్టీ కార్యకర్తల సహకారంతో ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వ్యక్తిగత ప్రయోజనాలకే ఉపయోగపడుతుంది. మరెలాంటి ప్రయోజనం ఉండదు’ అని పేర్కొన్నారు.

2017లో రోజ్ వ్యాలీ యజమాని నుంచి రూ.27 లక్షలు తీసుకున్న ఆరోపణలపై సీబీఐ సుదీప్‌ను అరెస్ట్ చేసి భువనేశ్వర్ జైలుకు పంపింది. నెలరోజుల పాటు జైలులో ఉన్నాక అతనికి బెయిల్‌ వచ్చింది. 2018లో జరిగిన ఈ కుంభకోణంలో ఈడీ రూ.130 కోట్లను స్వాధీనం చేసుకుని, సుదీప్‌ను విచారించింది.  కాగా కునాల్‌ ఘోష్‌ తన రాజీనామాకు ముందే తన ట్విట్టర్ ప్రొఫైల్ నుండి టీఎంసీ అధికార ప్రతినిధి, జనరల్ సెక్రటరీ తదితర పోస్ట్‌లను తొలగించి, జర్నలిస్టు, సామాజిక కార్యకర్త అని రాశారు. 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)