‘వాళ్లు నేరస్తులు కాదు..’ ప్రభుత్వంపై బీజేపీ నేత ఫైర్‌

Published on Thu, 12/28/2023 - 14:55

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత  కేఎస్ ఈశ్వరప్ప కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో సైన్‌బోర్డు, నేమ్‌ప్లేట్లల వ్యవహారం విధ్వంసానికి దారితీసిన సంగతి తెలిసిందే. కన్నడ భాషలోనే సైన్‌ బోర్డులు పెట్టుకోవాలంటూ కర్ణాటక రక్షణ వేదిక(ఎన్‌జీ) కార్యకర్తలు బుధవారం బెంగళూరులో ర్యాలీలతో వీరంగం సృష్టించారు. అయితే ఆందోళనకు దిగిన నిరసనకారులను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప మండిపడ్డారు. అరెస్ట్‌ చేయబడిన నిరసనకారులు నేరస్తులు కాదని.. వారంతా కన్నడ భాష పరిరక్షకులని అన్నారు. కన్నడ భాషలనే నేమ్‌ ప్లేట్లు, సైన్‌ బోర్డులు పెట్టాలని నిరసన కారులు చేసిన డిమాండ్‌ ఆమోదయోగ్యమైందని తెలిపారు. వారిని ఎందుకు అరెస్ట్ చేశారలో తనకు ఇప్పటికీ అర్థం కావటంలేదని మండిపడ్డారు.

ప్రభుత్వం తక్షణమే అరెస్ట్ చేసిన నిరసన కారులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వారు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని అన్నారు. ఇక  కర్ణాటకలో వ్యాపారస్తులు తప్పనిసరిగా కన్నడ భాషలోనే సైన్‌ బోర్డులు పెట్టుకోవాలని అన్నారు. అయితే నిరసకారులను బెంగళూరు పోలీసులు అరెస్ట్‌ చేయడంపై సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించారు. నిరసన తెలిపేవారికి తాము వ్యతిరేకం కాదన్నారు. కానీ.. చట్టం తమ చేతుల్లోకి తీసుకోవడం సరికాదని తెలిపారు.  

చదవండి:  ‘కన్నడ’ బోర్డుల రగడ  

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)