Breaking News

కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది ఇదే ప్రథమం

Published on Wed, 01/24/2024 - 15:01

జైపూర్‌: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో ఇంజినీరింగ్‌ కోసం సిద్ధమవుతున్న ఓ విద్యార్థి మంగళవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోటీ పరీక్షల కేంద్రంగా పేరొందిన కోటాలో గత ఏడాది 29 ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకోవడం గురించి తెలిసిందే. కాగా.. ఈ ఏడాది ఇదే  తొలి విద్యార్థి ఆత్మహత్య.

యూపీలోని మొరాదాబాద్‌కు చెందిన మహ్మద్ జైద్(18) అనే విద్యార్థి కోట హాస్టల్‌లో ఉంటూ జేఈఈ మెయిన్స్ కోచింగ్‌లో చేరాడు. మంగళవారం అర్ధరాత్రి గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా ప్రదేశంలో సూసైడ్ నోట్ లాంటివి కనిపించలేదు. ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియదు. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రాత్రి 11:00 ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

కోటాలో 2023లో 29 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కోచింగ్ సెంటర్‌ల అధిక ఒత్తిడి కారణంగా విద్యార్థులు మానసికంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ ఆత్మహత్యలు తగ్గడం లేదు.   

ఇదీ చదవండి: ముంబైలో రామ భక్తులపై దాడులు.. నిందితులపై బుల్డోజర్‌ యాక్షన్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)