Breaking News

‘చెక్క బెంచీలపై ‍ప్రయాణం ఎన్నటికీ మరువలేం’

Published on Sun, 09/29/2024 - 08:00

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో 1873 నుంచి  అంటే గత 150 ఏళ్లుగా నడుస్తున్న ట్రామ్ సేవలకు త్వరలో స్వస్తి చెప్పనున్నారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సవాళ్ల పరిష్కారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ  నిర్ణయం తీసుకుంది.

అయితే కేవలం ఒక ట్రామ్‌ సర్వీసును కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కోల్‌కతాలో చారిత్రాత్మక రవాణా సర్వీసులను నిలిపివేయడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ బస్సులలో తాము సాగించిన ప్రయాణాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. ట్రామ్‌ బస్సుల శకం ముగిసిందని, అయితే ప్రయాణికులు  ఎప్పటికీ చెక్క బెంచీలపై కూర్చుని ప్రయాణించడాన్ని మరచిపోరని పలువురు అంటున్నారు.

తెలుపు, నీలి రంగుల ట్రామ్‌లు బెంగాలీల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. కోల్‌కతా నగరాన్నికున్న గుర్తింపులో ట్రామ్‌ బస్సులకు ప్రత్యేక స్థానం ఉంది. సోషల్ మీడియాలో ఒక యూజర్‌ భావోద్వేగానికి గురవుతూ ‘ఒక శకం ముగిసింది. కోల్‌కతాలో 150 ఏళ్ల ట్రామ్ వారసత్వం ముగిసింది. ఈ ప్రతిష్టాత్మక అధ్యాయం ముగింపుతో, చరిత్రలోని ఒక ఘనమైన అధ్యాయానికి వీడ్కోలు పలుకుతున్నాం. రాబోయే తరాలు ట్రామ్‌ల గురించి  ఫోటోలు, వీడియోలను చూసి మాత్రమే తెలుసుకోగలుగుతాయి’ అని రాశారు.  

మరొక యూజర్‌ ‘కోల్‌కతాలో 150 ఏళ్ల వారసత్వ రవాణా వ్యవస్థ ట్రామ్ బంద్‌ అవుతోంది. కోల్‌కతా వీధుల్లో దీనిని మిస్ అవుతున్నాం’ అని రాశారు. ఇంకొక యూజర్‌ ‘కోల్‌కతాలోని పురాతన ట్రామ్ వ్యవస్థను నిలిపివేస్తున్నందుకు అభినందనలు. దానిని ఆధునీకరించడానికి బదులుగా, నిలిపివేస్తున్నారు. చరిత్రను చెరిపివేయగలిగినప్పుడు, దానిని ఇంకా ఎందుకు భద్రపరచాలి?" అరాచకం రాజ్యమేలుతున్నప్పుడు పర్యావరణ అనుకూల రవాణా అవసరమా?’ అంటూ ఆవేదనతో ప్రశ్నించారు. 

ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఒక పోలీసు వీరమరణం

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)