Breaking News

ట్రైనీ డాక్టర్‌ హత్య.. నిందితుడికి నాలుగు పెళ్లిళ్లు!

Published on Sun, 08/11/2024 - 19:03

కోల్‌కతా : కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌ హత్య కేసు సంచలనంగా మారింది. ఆర్‌జీ కార్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో విధుల్లో ఉండగా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగింది. దీంతో నిందితుల్ని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలంటూ డాక్టర్లు, విద్యార్ధులు  పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండగా.. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

అయితే సంజయ్ రాయ్‌ తల్లి మాలతీ రాయ్ మాత్రం ‘నా కొడుకు నిర్ధోషి.పోలీసుల ఒత్తిడితోనే చేయని తప్పును చేసినట్లు ఒప్పుకున్నాడని’ అన్నారు.

అరెస్ట్‌ అనంతరం నిందితుడు సంజయ్‌ రాయ్‌ గురించి పోలీసులు నిందితుడు నివాసం ఉంటున్న ప్రాంతాల్ని, స్థానికులు, బంధువుల్ని ఆరా తీస్తున్నారు. పోలీసుల విచారణలో నిందితుడికి నాలుగు పెళ్లిళ్లు అయ్యాయని, దుష్ప్రవర్తన కారణంగా ముగ్గురు భార్యలు అతన్ని విడిచిపెట్టినట్లు తెలిపారు. నాలుగో భార్య గతేడాది క్యాన్సర్‌తో మరణించింది. నిందితుడు తాగిన మత్తులో తరచూ అర్థరాత్రి ఇంటికి తిరిగి వచ్చేవాడని స్థానికులు చెప్పారు.  

సూపరింటెండెంట్‌ తొలగింపు 
మరోవైపు ట్రైనీ డాక్టర్‌ హత్యతో పశ్చిమ బెంగాల్‌ మమతా బెనర్జీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆర్‌జీ కార్‌ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్‌ని ఆ పదవి నుండి తొలగిస్తూ పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చాలా కాలంగా ఆసుపత్రికి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సూపరింటెండెంట్ డాక్టర్ సంజయ్ వశిష్టను తొలగించారు. అతని స్థానంలో ఆసుపత్రి డీన్ బుల్బుల్ ముఖోపాధ్యాయను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 

 బాధ్యులైన వారిపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైద్యులు, వైద్య విద్యార్థులు కొనసాగుతున్న నిరసనల మధ్య ఈ నిర్ణయం తీసుకుంది.

నాలుగు పేజీల ప్రాథమిక పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌లో 
ఆర్‌జీ కార్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో విధుల్లో ఉండగా హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్‌ నాలుగు పేజీల ప్రాథమిక పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. ఆమె కళ్లు, నోటి నుంచి బ్లీడింగ్‌ అయిందని.. ముఖం, గోళ్లపై గాయాలతో పాటు కడుపు, ఎడమ కాలు, మెడ, కుడి చేయి, పెదవులు, చేతి వేళ్లపై గాయాలయ్యాయి. ఆమె రహస్య అవయవాల నుంచి బ్లీడింగ్‌ అయినట్లు పోస్టు మార్టం నివేదికలో తేలింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)