Breaking News

మోనోజిత్‌ మామూలోడు కాదు.. లా కాలేజీలో ఇన్ని జరిగాయా?

Published on Wed, 07/02/2025 - 07:18

కోల్‌కతా: సౌత్‌ కోల్‌కత్తా లా కాలేజీలో విద్యార్థినిపై గ్యాంగ్‌ రేప్‌ కేసు మరో మలుపు తిరిగింది. ఈ దారుణానికి పాల్పడిన ప్రధాన నిందితుడు మోనోజిత్‌ మిశ్రా గతంలో తనపైనా లైంగిక దాడికి పాల్పడ్డాడని మరో విద్యార్థిని తెలిపింది. రెండేళ్ల క్రితం కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుందని వివరించింది.

కాగా, అతడికి రాజకీయ పలుకుబడి, ముఖ్యంగా కాలేజీ బోర్డు అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే అశోక్‌ కుమార్‌ దేబ్‌ అండ ఉందని వివరించింది. బయటకు వెల్లడిస్తే తీవ్ర పరిణామాలుంటాయని తల్లిదండ్రులను, సోదరిని చంపేస్తానంటూ అతడు బెదిరించాడని తెలిపింది. భయపడి ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయినట్లు తెలిపింది. తన మాదిరిగా మోనోజిత్‌ సుమారు 15 మంది విద్యార్థినులను వేధించాడని ఆరోపించింది. మోనోజిత్‌పై కొందరు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని తెలిపింది.

ఇదిలా ఉండగా, రెండు నెలల క్రితం మోనోజిత్‌ పోలీసు అధికారిపై దాడి చేయడంతోపాటు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసినట్లు తాజాగా వెల్లడైంది. కస్బా ప్రాంతంలోని లా కాలేజీకి సమీపంలో హెచ్‌డీఎఫ్‌సీ కియోస్క్‌ వద్ద ఏప్రిల్‌ 13న ఈ ఘటన చోటుచేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జూన్‌ 28వ తేదీన లా కాలేజీలో జరిగిన గ్యాంగ్‌ రేప్‌ కేసులో ప్రధాన నిందితుడు మోనోజిత్‌ను కాంట్రాక్టు ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పించారు. అదేవిధంగా, ఇద్దరు సహ నిందితుడు ప్రమిత్‌ ముఖర్జీ, జయీబ్‌ అహ్మద్‌లను కాలేజీ నుంచి బహిష్కరించారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే అశోక్‌ కుమార్‌ దేబ్‌ సారథ్యంలో జరిగిన కాలేజీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వీరు ముగ్గురూ పోలీస్‌ కస్టడీలో ఉన్నారు.

ఇదిలా ఉండగా.. విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార కేసులో నిందితులపై కళాశాల యాజమాన్యం చర్యలు తీసుకుంది. విద్యార్థులు జైబ్‌ అహ్మద్, ప్రమిత్‌ ముఖర్జీలను కళాశాల నుంచి బహిష్కరించినట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత అశోక్‌ కుమార్‌ నేతృత్వంలోని సౌత్‌ కోల్‌కతా లా కాలేజీ పాలక మండలి మంగళవారం వెల్లడించింది. కేసులో ప్రధాన నిందితుడు, లెక్చరర్‌గా పనిచేస్తున్న మోనోజిత్‌ మిశ్ర (31) కాంట్రాక్టును తక్షణమే రద్దు చేసినట్లు ప్రకటించింది. అలాగే క్రిమినల్‌ న్యాయవాదిగా ఆయన ప్రాక్టీసును రద్దు చేయమని కోరుతూ బార్‌ కౌన్సిల్‌కు దరఖాస్తు చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు బాధితురాలు కాలేజీకి ఒంటరిగా వెళ్లడం వల్లే అత్యాచారం జరిగిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎమ్మెల్యే మాదన్‌ మిత్రా బేషరతుగా క్షమాపణలు తెలిపారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)