Breaking News

కోల్‌కతాలో హైఅలర్ట్‌.. మూడు వలయాలుగా 6 వేలమంది పోలీసులు!

Published on Tue, 08/27/2024 - 07:52

కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్‌​ హాస్పిటల్‌లో జరిగిన జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటన.. దేశాన్ని కుదిపేసింది. న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు మంగళవారం 'నబన్న అభిజన్' (మార్చ్ టు సెక్రటేరియట్) పేరుతో నిరసనకు పిలుపునిచ్చాయి. 

సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఈ భారీ ర్యాలీ జరగనుంది. అయితే హింస చేలరేగే అవకాశం ఉండడంతో కోల్‌కతా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్‌ వద్ద సుమారు 6 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థి సంఘాల ముసుగులో.. అరాచక శక్తులు ర్యాలీలో పాల్గొన వచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

క్రెడిట్స్‌:  Zee News 

సామాన్య ప్రజలను రెచ్చగొట్టి అరాచకాలు సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సుమారు 19 పాయింట్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. 26 మంది డిప్యూటీ కమిషనర్లు పలు పాయింట్ల వద్ద ఎప్పటికప్పుడు పోలీసు భద్రతను పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు చోట్ల పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి కోల్‌కతా, హౌరాలో పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తామని పోలీసులు అధికారులు తెలిపారు. 

యువ వైద్యురాలిపై హత్యాచార ఘటన తర్వాత.. ఆగస్టు 14 అర్ధరాత్రి చేపట్టిన నిరసన  హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అందుకే పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ భద్రతకు ప్లాన్‌ చేశారు. మరోవైపు.. శాంతియుతంగా నిరసన తెలిపేవారిని అడ్డుకోవద్దని ఇటీవల సుప్రీం కోర్టు బెంగాల్‌ ప్రభుత్వాని​కి సూచించిన విషయం తెలిసిందే.

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు