Breaking News

కోల్‌కతా: సంచలన రిపోర్టు.. డాక్టర్‌పై సామూహిక అత్యాచారం?

Published on Wed, 08/14/2024 - 19:49

కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కార్‌ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌లో జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ‘ఈ కేసుపై విచారణ చేపట్టాం. ఢిల్లీ నుంచి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ వైద్య బృందాలు వచ్చాయి’అని సీబీఐ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. 

మరోవైపు.. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతురాలిపై సామూహిక హత్యాచారం జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్ట్‌మార్టం నివేదికతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది.  ఈ ఘటనలో మరో ఇద్దరు జూనియర్‌ డాక్టర్ల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యాప్తి చెందుతున్నాయి.

 

జూనియర్‌ డాక్టర్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె వ్యక్తిగత అవయవాలతో పాటు కళ్లు, నోటి నుంచి బ్లీడింగ్‌ అయిందని.. ముఖం, గోళ్లపై గాయాలతో పాటు కడుపు, ఎడమ కాలు, మెడ, కుడి చేయి, పెదవులు, చేతి వేళ్లపై గాయాలు ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్ట్‌మార్టంలో గుర్తించినట్లు తెలుస్తోంది. 

తమ కుమార్తెపై ఒకరి కంటే ఎక్కువ మంది అత్యాచారానికి పాల్పడి ఉంటారని బాధితురాలి తల్లిదండ్రులు కోల్‌కతా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించిన విషయం తెలిసిందే. పోస్ట్‌మార్టం రిపోర్టు వెల్లడించిన అంశాలు.. ఆమెపై సామూహిక హత్యచారం జరిగే ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)