Breaking News

కొచ్చి వాటర్ మెట్రో సరికొత్త రికార్డు.. 50 లక్షల ప్రయాణికులకు చేరిక

Published on Sun, 09/21/2025 - 13:57

కొచ్చి : కేరళలోని కొచ్చి వాటర్ మెట్రో ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. వాటర్ మెట్రో ప్రారంభించిన 29 నెలల్లోనే 50 లక్షల ప్రయాణికులను గమ్య స్థానాలకు తీసుకెళ్లిందని సంబంధిత అధికారులు ఆదివారం తెలిపారు. ఈ 50 లక్షల మెలురాయి ప్రయాణికునిగా ఆస్ట్రేలియాకు చెందిన  నైనా నిలిచారు.

శనివారం మధ్యాహ్నం ఫోర్ట్ కొచ్చికి ప్రయాణించేందుకు హైకోర్టు టెర్మినల్‌లో నైనా టిక్కెట్‌ కొనుగోలు చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కొచ్చి మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ లోక్‌నాథ్ బెహెరా నైనాకు ఒక బహుమతినిచ్చారు. పరిమిత సంఖ్యలో, రూట్లలో నడుస్తున్నప్పటికీ, వాటర్ మెట్రో సౌకర్యవంతమైన , అధిక నాణ్యత ప్రయాణ అనుభవాన్ని అందించడం కారణంగా ఈ విజయం సాధ్యమైందని బెహెరా పేర్కొన్నారు.

కేరళ ప్రభుత్వం ఏప్రిల్ 2023, ఏప్రిల్‌ 25న ప్రారంభించిన కొచ్చి వాటర్ మెట్రో స్థానికులతో పాటు పర్యాటకులలో ప్రజాదరణ పొందింది. అధికారిక ప్రకటన ప్రకారం ఈ ప్రాజెక్ట్‌తో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రపంచ బ్యాంకు తన సంసిద్ధతను వ్యక్తం చేసిందని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. కొచ్చి వాటర్ మెట్రో తన పనితీరు కారణంగా పలు అవార్డులను కూడా అందుకుంది. ప్రస్తుతానికి కొచ్చి వాటర్ మెట్రోలో హైకోర్టు, ఫోర్ట్ కొచ్చి, వైపీన్, బోల్గట్టి, ములవుకాడ్ సౌత్ చిత్తూరు, చేరనల్లూర్, ఎలంకుళం, వైట్టిల, కక్కనాడ్ సహా 10 టెర్మినల్స్‌లో 20 బోట్లు పనిచేస్తున్నాయి.

ప్రతిరోజూ ఉదయం 7.30 నుండి రాత్రి 9 గంటల వరకు కొచ్చి వాటర్ మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. రోజుకు 125 ట్రిప్పులు తిప్పుతున్నారు. కొచ్చి వాటర్ మెట్రో ప్రారంభించిన 107 రోజుల్లోనే మొదటి 10 లక్షల మంది ప్రయాణికులు నమోదయ్యారు. ఆ తర్వాత 95 రోజుల్లో 20 లక్షలు, 185 రోజుల్లో 30 లక్షలు, 160 రోజుల్లో 40 లక్షల మంది నమోదయ్యాయి.  తదుపరి 161 రోజుల్లో 50 లక్షల మంది ప్రయాణికుల రికార్డును చేరుకుందని సంబంధిత అధికారి తెలిపారు.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)