Breaking News

ఐరాసలో పాక్‌ తీరును ఎండగట్టిన పేటల్‌ గహ్లోత్‌ ఎవరు?

Published on Sat, 09/27/2025 - 17:01

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భారత్‌ను నిందించాలని ప్రయత్నించిన పాకిస్థాన్‌కు మరోసారి భంగపాటు ఎదురయ్యింది. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో సింధూజలాల ఒప్పందాన్ని భారత్‌ నిలిపివేసిన అంశాన్ని ప్రస్తావిస్తూ, పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌  పలు వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ఆరోపణలకు భారత దౌత్యవేత్త పేటల్ గహ్లోత్‌ గట్టిగా బదులిచ్చారు. అవాస్తవిక నాటకాలతో వాస్తవాలను ఎంతమాత్రం మార్చలేరంటూ ఆమె పాక్‌ తీరును కడిగిపారేశారు.

2015లో ఐఎఫ్‌ఎస్‌లో చేరి..
పేటల్‌ గహ్లోత్‌ మహారాష్ట్రలోని రాజ్‌పుత్‌ కుటుంబంలో పుట్టారు. ముంబయిలోని సెయింట్‌ జేవియర్‌ కళాశాల నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో పట్టా అందుకున్నారు. అనంతరం ఢిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజీ ఫర్‌ విమెన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ తీసుకున్నారు. 2015లో ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసెస్‌ (ఐఎఫ్‌ఎస్‌)లో చేరి దౌత్యవేత్తగా చేరారు. గత పదేళ్లలో ఆమె వివిధ హోదాల్లో విధులు నెరవేర్చారు. యూరోపియన్‌ వెస్ట్‌ డివిజన్‌లో అండర్‌ సెక్రటరీగా పనిచేశారు.
 

ఐరాసాలోని భారత మిషన్‌లో తొలి సెక్రటరీగా..
పారిస్‌, శాన్‌ఫ్రాన్సిస్కోల్లోని భారత దౌత్య కార్యాలయాల్లో విధులు నిర్వహించారు.తరువాతి కాలంలో ఐక్యరాజ్యసమితిలోని భారత మిషన్‌లో తొలి సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రపంచ వేదికలపై భారత్‌ తరఫున మాట్లాడుతూ, సమర్థురాలైన ప్రతినిధిగా పేరు తెచ్చుకున్నారు. గతంలోనూ ఆమె పాకిస్తాన్‌ ఆరోపణలను  ఐరాసలో బలంగా తిప్పికొట్టారు. ఇప్పుడు పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ వ్యాఖ్యలను తిప్పికొట్టడంతో ఆమె పేరు మరోసారి వార్తల్లో కనిపిస్తోంది. వృత్తి పరంగా దౌత్య వ్యవహారాల్లో మునిగితేలే పేటల్‌ గహ్లోత్‌కు సంగీతమంటే  ఎంతో ఆసక్తి. గిటార్‌ వాయిస్తూ పాటలు పాడుతుంటారు. వాటిని సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేస్తుంటారు. 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)