Breaking News

స్పీకర్‌ నిర్ణయం విచారకరం

Published on Fri, 12/19/2025 - 03:38

సాక్షి, న్యూఢిల్లీ: శాసనసభ్యుల పార్టీ ఫిరాయింపులపై రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ తీసుకున్న నిర్ణయం విచారకరమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘కొందరు ఎమ్మెల్యేలు తాము పార్టీలు మారినట్లు స్వయంగా టీవీల ముందు, ప్రజల ముందు చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు. 

ఇన్ని ఆధారాలున్నా.. వారు పార్టీ మారలేదని స్పీకర్‌ చెప్పడం విచారకరం. నాడు కాంగ్రెస్‌ గుర్తుపై గెలిచిన వారికి బీఆర్‌ఎస్‌ మంత్రి పదవులు ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా అదే దారిలో నడుస్తోంది. ఈ రెండు పార్టీలు చట్టాన్ని అపహాస్యం చేస్తున్నాయి. తెలంగాణలో ఏ విధంగా రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారో రాహుల్‌గాంధీ తెలుసుకోవాలి’అని డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగానే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటుందని కిషన్‌రెడ్డి చెప్పారు.  

నష్టాల ఊబిలో విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు.. 
‘11 ఏళ్లుగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. విద్యుదుత్పత్తి, విద్యుత్‌ సరఫరాపై సమర్థవంతంగా పనిచేస్తోంది. పవర్‌ జనరేషన్, పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో.. పారిశ్రామిక, గృహ, వ్యవసాయ అవసరాలకు విద్యుత్‌ కొరత ఉంది. తెలంగాణలోనూ విద్యుత్‌ సరఫరాకు అవసరమైన సహాయాన్ని కేంద్రం అందిస్తోంది. 

భవిష్యత్తులో అందించేందుకూ సిద్ధంగా ఉంది. కానీ.. తెలంగాణలో ప్రస్తుతం విద్యుదుత్పత్తి సంస్థలు, విద్యుత్‌ పంపిణీ సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోవడం దురదృష్టకరం. పదేళ్లపాటు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, రెండేళ్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఎలాంటి నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోలేదు’అని కిషన్‌రెడ్డి విమర్శించారు.  

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)