Breaking News

Uttar Pradesh: రెండుగా విడిపోయిన కిసాన్‌ ఎక్స్‌ప్రెస్‌.. తప్పిన ముప్పు

Published on Sun, 08/25/2024 - 11:28

ఉత్తరప్రదేశ్‌లో వరుస రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బిజ్నోర్‌లో కిసాన్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు భాగాలుగా విడిపోయింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని రైల్వే అధికారులు చెబుతున్నారు.

మీడియాకు అందిన వివరాల ప్రకారం బిజ్నోర్‌లోని సియోహరా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. యూపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు వెళుతున్న అభ్యర్థులు ఈ రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం రైల్వే శాఖ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదానికి గల కారణాలను కూడా ఆరా తీస్తున్నారు.

కిసాన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫిరోజ్‌పూర్ నుండి ధన్‌బాద్ వెళ్తోంది. ఈ రైలు బిజ్నోర్‌లోని సియోహరా రైల్వే స్టేషన్ నుండి బయలుదేరింది. అకస్మాత్తుగా దాని కప్లింగ్‌ విరిగిపోయింది. ప్రమాదానికి గురైన రైలులో మొత్తం 22 కోచ్‌లు ఉండగా, వాటిలో  ఎనిమిది కోచ్‌లు వేరయ్యాయి. స్టేషన్‌ నుంచి రైలు కొంత దూరం వెళ్లిన తరువాత వెనుకనున్న ఎనిమిది బోగీలు విడిపోయాయని అధికారులు తెలిపారు. రైలులో కూర్చున్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఫరూఖాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటన మరవకముందే ఈ రైలు ప్రమాదం చోటుచేసుకోవడం రైల్వే అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)