Breaking News

శంకర్‌ దయాళ్‌ శర్మకు ఏనుగు గిఫ్ట్‌.. అసలు ఆ కథేంటి?

Published on Tue, 10/15/2024 - 11:52

ఢిల్లీ: ఢిల్లీ జూలో ఉన్న 29 ఏళ్ల ఆఫ్రికన్ ఏనుగు ‘శంకర్‌’ ఆరోగ్యం, గొలుసుల బంధీ నుంచి విడిపించడానికి కేంద్ర సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ చేసిన ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి. ఆఫ్రికన్ ఏనుగు శంకర్ శుక్రవారం గొలుసుల నుంచి విముక్తి చేశారు. ఇప్పుడు ఆ ఏనుగు జూలోని తన ఎన్‌క్లోజర్‌లో చురుకుగా తిరుగుతోంది. అయితే ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్‌ ‘ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. 

‘‘అక్టోబర్ 9న నేను జూని సందర్శించాను. ఆఫ్రికన్ ఏనుగు 'శంకర్'ను పరిశీలించాను.  ఏనుగు ‘శంకర్’ ఆరోగ్యం కోసం పర్యావరణ మంత్రిత్వ శాఖ, జామ్‌నగర్‌కు చెందిన ‘వంతరా’ బృందం, నిపుణులైన వెటర్నరీ వైద్యుల బృందం చేసిన కృషికి ధన్యవాదాలు. అందులో నీరజ్, యదురాజ్‌, దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్, ఫిలిప్పీన్స్‌కు చెందిన మైఖేల్ ఉన్నారు. శంకర్‌ ఆరోగ్యం, పరిశీలనకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక కొనసాగుతోంది’’ అని అన్నారు.

 

ప్రస్తుతం జూలో ఉన్న మావటిలు.. శంకర్‌తో సులభంగా సంభాషించేలా శిక్షణ తీసుకుంటారని జూ అధికారులు తెలిపారు. ఏనుగు ‘శంకర్’ ప్రవర్తన , దినచర్యను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. శంకర్ పురోగతిని తనిఖీ చేయడానికి ఫిలిప్పీన్స్‌కు చెందిన మావటి మైఖేల్‌తో కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ప్రస్తుతం శంకర్ గతంలో కంటే చాలా కనిపిస్తోందని జూ అధికారులు తెలిపారు.

1996లో అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు జింబాబ్వే దౌత్య బహుమతిగా ఇచ్చిన ఈ ఏనుగు(శంకర్‌)ను సరిగా చూసుకోవడం లేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్క్ (జూ) సభ్యత్వాన్ని వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ అక్వేరియమ్స్ (వాజా) ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది.

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు