శాంతి శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని బదులు మంత్రి కేవీ సింగ్‌

Published on Mon, 10/13/2025 - 05:45

న్యూఢిల్లీ: ఈజిప్టులోని ఎర్ర సముద్ర తీర నగరం షర్మ్‌ ఎల్‌ షేక్‌లో సోమవారం జరిగే శాంతి శిఖరాగ్ర సదస్సు(పీస్‌ సమిట్‌)కు మన దేశం తరఫున కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్‌ సింగ్‌ హాజరవనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సహా 20కి పైగా దేశాల నేతలు పాల్గొనే ఈ సమావేశానికి రావాలంటూ ఈజిప్టు అధ్యక్షుడు ఎల్‌ సిసి ప్రధాని మోదీకి ఆదివారం ఆహ్వానం పంపించారు. 

అయితే, ఆయన తన బదులుగా మంత్రి కేవీ సింగ్‌ను పంపిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గాజాతోపాటు పశ్చిమాసియాలో శాంతి నెలకొల్ప డమే లక్ష్యంగా జరిగే కార్యక్రమానికి ఈజిప్టు అధ్యక్షు డు ఎల్‌ సిసి, ట్రంప్‌ సహాధ్యక్షత వహించనున్నారు. గాజా శాంతి ఒప్పందంపై ఈ సందర్భంగా సంతకాలు జరుగుతాయి. శిఖరా గ్రానికి ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటె రస్, యూకే ప్రధాని స్టార్మర్, ఇటలీ ప్రధాని మెలోనీ, స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ తదితర నేతలు హాజరవ నున్నారు.

బాంబు పేల్చిన హమాస్‌
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతిపాదించిన శాంతి ఒప్పందం అమలుపై అప్పుడే అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఆదివారం హమాస్‌ చేసిన ప్రకటనే ఇందుకు తాజా ఉదాహరణ. సోమవారం ఈజిప్టులో జరిగే శాంతి శిఖరాగ్రాన్ని తాము బహిష్కరిస్తున్నామని హమాస్‌ తెలిపింది. ట్రంప్‌ ప్రతిపాదించిన శాంతి ఒప్పందంపై తాము సంతకం చేసేది లేదని స్పష్టం చేసింది.  

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)