Breaking News

‘న్యాయశాఖ’ నుంచి రిజిజుకు ఉద్వాసన

Published on Fri, 05/19/2023 - 04:17

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియంలో మరింత పారదర్శకత కోరుతూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్‌ రిజిజును ఆ శాఖ బాధ్యతల నుంచి మోదీ సర్కార్‌ తప్పించింది. న్యాయవ్యవస్థతో ఎలాంటి బేధాభిప్రాయాలు పొడచూపకూడదనే ఉద్దేశంతోనే ఈయన శాఖను మార్చారని తెలుస్తోంది.

పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖల స్వతంత్ర మంత్రి అర్జున్‌సింగ్‌ మేఘ్‌వాల్‌కు న్యాయశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. కేబినెట్‌ ర్యాంక్‌లేని ఒక స్వతంత్ర హోదా మంత్రికి కీలకమైన న్యాయశాఖను అప్పగించడం గత పాతికేళ్లలో ఇదే తొలిసారి. 

ఎందుకు మార్చారు ?
సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జీలను సొంతంగా సుప్రీంకోర్టే కొలీజియం పేరిట నియమించుకోవడం ఎక్కడా లేదని, ఇదొక ఏలియన్‌ విధానం అని, మాజీ జడ్జీలు దేశవ్యతిరేక గ్యాంగ్‌లుగా తయారయ్యారని రిజిజు గతంలో ఆరోపించారు. దీంతో తమ బాధ్యతలు, విధుల్లో ప్రభుత్వ జోక్యం అనవసరమని సుప్రీంకోర్టు కొలీజియం ఘాటుగా బదులిచ్చింది.

మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతున్న ఈ తరుణంలో రిజిజు వ్యాఖ్యలు విపక్షాలకు ఎన్నికల అస్త్రంగా మారకూడదనే ఉద్దేశంతోనే ఆయనను తప్పించినట్లు వార్తలొచ్చాయి. ఇన్నాళ్లూ మరో మంత్రి జితేంద్ర సింగ్‌ నిర్వహించిన భూ విజ్ఞానశాస్త్ర శాఖను రిజిజుకు అప్పగించారు. ప్రధాని మోదీ సలహా మేరకు రిజిజు, మేఘ్‌వాల్‌ శాఖలను మార్చుతున్నట్లు గురువారం రాష్ట్రపతిభవన్‌ ఒక నోటిఫికేషన్‌ విడుదలచేసింది.

కాగా, బాధ్యతలు మారడంపై రిజిజు స్పందించారు. ‘ భూ విజ్ఞాన శాఖలో ప్రధాని మోదీ దార్శనికతను సుసాధ్యం చేసేందుకు శాయశక్తుల కృషిచేస్తా. ఇంతకాలం న్యాయశాఖ మంత్రిగా కొనసాగడం గౌరవంగా భావిస్తున్నా. ఇందుకు మద్దతు పలికిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌సహా మొత్తం న్యాయవ్యవస్థకు నా కృతజ్ఞతలు’ అని రిజిజు ట్వీట్‌ చేశారు. 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)