‘ప్రతిష్టంభన’ తొలగింపునకు రాహుల్‌తో కిరణ్ రిజిజు భేటీ

Published on Wed, 08/05/2026 - 11:29

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు రంగంలోకి దిగారు. దీనిలో భాగంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఆయన భేటీ అయ్యారు. పార్లమెంట్ భవనంలోని లోక్‌సభ ప్రతిపక్ష నేత కార్యాలయంలో జరుగుతున్న ఈ కీలక సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా హాజరయ్యారు. పార్లమెంట్ సజావుగా సాగేలా చూడటం, వివిధ అంశాలపై నెలకొన్న ప్రతిష్టంభనను దాటవేయడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

దీనికిముందు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా విమర్శించారు. రాహుల్ సభలో గందరగోళం సృష్టిస్తూ, ఇతరులను మాట్లాడనివ్వడం లేదని ఆయన మండిపడ్డారు. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తే ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడే అవకాశం కల్పిస్తామని తాను స్పీకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి హామీ ఇచ్చినట్లు మంత్రి రిజిజు వెల్లడించారు. మరోవైపు, స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్న అంశంపై కిరణ్ రిజిజు స్పందిస్తూ.. దానివల్ల ఎలాంటి ప్రభావం ఉండదని తేల్చిచెప్పారు. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం తెచ్చుకోవచ్చని, అయితే సభలో వారికి తగిన సంఖ్యాబలం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ప్రతిపక్షాల తీరు ఉందని, సభను అడ్డుకోవడం సరికాదని ఆయన హితవు పలికారు.
 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)