Breaking News

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ మరోసారి బెదిరింపులు

Published on Tue, 01/16/2024 - 12:16

ఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను ఈ రిపబ్లిక్ డే రోజు హత్య చేస్తానని బెదిరింపులు చేశాడు. జనవరి 26న భగవంత్ మాన్‌పై గ్యాంగ్‌స్టర్లు ఏకమై దాడికి దిగాలని పన్నూ కోరారు. 

గ్యాంగ్‌స్టర్లపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నదని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. పన్నూ బెదిరింపులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

సిక్కు ఫర్ జస్టిస్ (SFJ) వ్యవస్థాపకుడు పన్నూ గతంలో భారతీయ సంస్థలు, అధికారులపై అనేకమార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. గత నెల, డిసెంబర్ 13న భారత పార్లమెంటుపై దాడి చేస్తానని వీడియోను విడుదల చేశాడు. అదే క్రమంలో పార్లమెంట్‌పై డిసెంబర్ 13న ఆగంతకులు కలర్‌ బాంబు షెల్స్‌తో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ మరొక బెదిరింపు వీడియో ఇటీవల బయటపడింది. నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో వెళ్లాలనుకుంటున్న ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని బెదిరింపులు చేశాడు. ఎయిరిండియా బెదిరింపు వీడియోపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పన్నూపై కేసు నమోదు చేసింది. 

ఇదీ చదవండి: కృష్ణ జన్మభూమి కేసు: మసీదు సర్వేపై సుప్రీంకోర్టు స్టే

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)