Breaking News

తీవ్ర హెచ్చరిక.. జాగ్రత్తగా వినండి సీఎం.. మధ్యలో వచ్చి బలికావొద్దు!

Published on Sun, 04/02/2023 - 18:45

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు బెదిరింపులు ఎదురయ్యాయి. ఖలిస్తాన్‌ ఉగ్రవాది, సిక్‌ ఫర్‌ జస్టిస్‌ సంఘం నేత గురుపత్వాన్‌ సింగ్‌ పన్నూ సీఎంపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అస్సాం జర్నలిస్టులకు కాల్‌ చేసి ముఖ్యమంత్రిని బెదిరించాడు. పంజాబ్‌లో ఖలిస్తాన్‌ వేర్పాటు వాది, అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం గాలింపు కొనసాగుతున్న వేళ అస్సాం సీఎంకు బెదిరింపులు రావడం చర్చనీయాంశంగా మారింది. 

‘ఖలిస్తాన్ అనుకూల మద్దతుదారులను అస్సాంలో నిర్భంధించి హింసిస్తున్నారు. జాగ్రత్తగా వినండి సీఎం శర్మ.. ఇక్కడ పోరాటం ఖలిస్తాన్‌ అనుకూల సిక్కులకు.. భారత ప్రభుత్వానికి మధ్య జరుగుతోంది. అనవసరంగా ఈ హింసలో మీరు బలికావద్దు’ అని హెచ్చరించాడు. అలాగే ‘మేము ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణ మేరకు శాంతియుత ప్రజాస్వామ్య పద్దతిలో భారత ఆక్రమణ నుంచి పంజాబ్‌ను విముక్తి చేయాలని కోరుతున్నాం. మీ ప్రభుత్వం దిబ్రూగఢ్ సెంట్రల్ జైలులో ఉన్న అమృతపాల్ మద్దతురాలైన ఆరుగురుని ఖైదీలుగా మార్చి వేధింపులకు గురిచేస్తోంది. మీరు దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని పన్నూ ఫోన్‌లో బెదిరించాడు.

కాగా వారిస్‌ పంజాద్‌ దే చీఫ్‌ అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం పంజాబ్‌ పోలీసులు మార్చి 18 నుంచి ముమ్మరంగా గాలిస్తున్నారు. పోలీసులకు చిక్కిన్నట్లే చిక్కి వేషాలు, వాహనాలు మార్చుకుంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇప్పటి వరకు వందలాది ఖలిస్తాన్‌ మద్దతుదారులు, అమృత్‌పాల్‌ సహాయకులను పంజాబ్ పోలీసులు అరెస్ట్‌ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అయితే భద్రతా కారణాల రీత్యా అతడి ఆరుగురు సహాకులను అస్సాంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించారు.
చదవండి: అఫ్తాబ్ పూనావాలాపై దాడి.. జైలులో చితకబాదిన తోటి ఖైదీలు..!

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)