Breaking News

శంకరాచార్య కేసులో మరో కీలక పరిణామం

Published on Thu, 02/26/2026 - 19:08

ఉత్తరప్రదేశ్‌లో చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితులైన చిన్నారుల మెడికల్ రిపోర్ట్ విడుదలైంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. మైనర్లపై లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. బుధవారం ప్రయాగ్‌రాజ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు వైద్యుల బృందం బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించింది. సీల్డ్‌ కవర్‌లో నివేదికను గురువారం దర్యాప్తు అధికారికి అందజేశారు.

ఈ నివేదికను రేపు (శుక్రవారం) కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని పోలీస్‌ అధికారులు తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాతే అవిముక్తేశ్వరానందపై వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున  ఈ కేసు వివరాలను వెల్లడించలేమని అధికారులు తెలిపారు.

శంకరాచార్యపై ఫిర్యాదు చేసిన జగద్గురు రాంభద్రాచార్య శిష్యుడు అశుతోష్ మహరాజ్ మాట్లాడుతూ, ఈ కేసులో తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని.. మెడికల్ పరీక్షల్లో చిన్నారులపై లైంగికదాడి జరిగినట్లు తేలిందని.. త్వరలోనే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. బాధిత విద్యార్థి మొదటిసారిగా 'ఆజ్ తక్' మీడియా సంస్థతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. తాను చదువుకోవడానికి ఆశ్రమానికి వెళ్లానని.. అక్కడ తనను వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న ఇతర పిల్లలపై కూడా దాడులు జరిగాయని పేర్కొన్నారు.

కాగా, బుధవారం అర్ధరాత్రి శంకరాచార్య తరపు న్యాయవాది మొబైల్‌కు బెదిరింపు కాల్‌ వచ్చింది. వారణాసి కోర్టు సముదాయాన్ని బాంబుతో పేల్చివేస్తామని, న్యాయవాదిని కూడా చంపేస్తామని ఆ సందేశంలో హెచ్చరించినట్లు సమాచారం. గత నాలుగు రోజులుగా ప్రయాగ్‌రాజ్ పోలీసులు వారణాసిలో మోహరించారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో మైనర్లపై లైంగిక వేధింపుల కేసులో స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతితో పాటు ఆయన శిష్యడు ముకుందానంద గిరిపై  ప్రయాగ్ రాజ్ ఫోక్సో ప్రత్యేక కోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

సెక్షన్ 173 కింద ఆయనపై కేసు నమోదు చేసింది. జ్యోతిష్య పీఠం కేసులో మైనర్లుపై లైంగిక దాడి కేసులో ఇద్దరు మైనర్ల వాంగ్మూలాలను కోర్టు స్వీకరించింది. జనవరి 28న అవిముక్తేశ్వరంద్ సరస్వతి ఆశ్రమంలో మైనర్ పిల్లలపై లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఫిబ్రవరి 13న కోర్టు నిందితుల వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. నిందితులలపై కేసు నమోదు చేసి విచారించాలని ఆదేశించింది.

 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)