కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే

Published on Fri, 12/12/2025 - 17:31

ఢిల్లీ: జనాభా లెక్కల సేకరణకు 11,718 కోట్ల రూపాయల కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండు విడతల్లో జనగణన నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. తొలివిడతలో ఇళ్ల లెక్కింపు, అనంతరం జనాభా లెక్కలు చేపట్టనున్నారు. 2026 ఏప్రిల్, సెప్టెంబర్‌లలో హౌస్ లిస్టింగ్, 2027 ఫిబ్రవరిలో జనగణన చేయనున్నారు.

30 లక్షల మంది సిబ్బందితో జనాభా లెక్కల సేకరణ చేయనున్నారు. మొబైల్ యాప్‌తో డేటా సేకరించనున్నారు. సెంట్రల్ పోర్టల్ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా పర్యవేక్షించనున్నారు.

‘కోల్  సేతు విండో’కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బొగ్గు గనుల రంగంలో సంస్కరణల కోసం కొత్త పాలసీకి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. కొబ్బరి కి మద్దతు ధర ప్రకటించిన కేంద్ర కేబినెట్.. 2026 సీజన్‌లో క్వింటాల్ మిల్లింగ్ కొబ్బరి కి క్వింటాల్‌కు రూ. 445 రూపాయలు. బాల్  కొబ్బరి క్వింటాలుకు  400 రూపాయలు మద్దతు ధర పెంచింది. మిల్లింగ్ కొబ్బరి  క్వింటాలు ధర: 12,027 రూపాయలు, బాల్ కొబ్బరి ధర 12,500 ప్రకటించింది.

ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మార్పు చేసింది. పనిదినాలు ఏడాదికి 120 రోజులకు పెంచింది. ఈ పథకాన్ని మొదట జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 (NREGA)గా ప్రారంభించగా.. తరువాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)గా మార్చారు. తాజాగా.. 'పూజ్య బాపు ఉపాధి హామీ పథకం'గా మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

 

Videos

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)