Breaking News

‘26/11’ కుట్రదారులు ఇంకా బయటే...

Published on Sat, 10/29/2022 - 06:05

ముంబై:  ముంబైలో 2008 నవంబర్‌ 26న జరిగిన ఉగ్రవాద దాడుల కుట్రధారులు, పాత్రధారులు ఇప్పటికీ రక్షణ పొందుతూనే ఉన్నారు. నిక్షేపంగా తిరుగుతున్నారు. వారికి ఏ శిక్షలూ పడడం లేదు’’ అని విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఆక్షేపించారు. ఉగ్రవాదం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు విస్తరించిందని, దానితో నష్టాల గురించి ఇతరుల కంటే భారత్‌కే ఎక్కువగా తెలుసని అన్నారు. ‘ఉగ్రవాద కార్యకలాపాలకు నూతన సాంకేతికను వాడుకోకుండా నిరోధించడం’ అనే అంశంపై 26/11 దాడులకు సాక్షిగా నిలిచిన ముంబైలోని తాజ్‌ హోటల్‌లో జరిగిన ప్రత్యేక సదస్సులో ఆయన మాట్లాడారు.

దాడుల మృతులకు గబాన్‌ దేశ విదేశాంగ మంత్రి, యూఎన్‌ఎస్సీ అధ్యక్షుడు మైఖేల్‌ మౌసా–అడామో తదితరులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మరో దేశం నుంచి వచ్చిన ముష్కరులు మారణహోమం సృష్టించారని పాకిస్తాన్‌పై ధ్వజమెత్తారు. కరడుగట్టిన ఉగ్రవాదుల విషయంలో రాజకీయ కారణాల వల్ల ఐరాస భద్రతా మండలి చర్యలు తీసుకోలేకపోతోందన్నారు. పాక్‌ ఉగ్రవాదులపై ఆంక్షలు విధించకుండా చైనా çఅడ్డుకుంటోందని విమర్శించారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలంటే ఆ సంస్థలకు నిధులందకుండా చేయాలని సూచించారు. అలా చేస్తే వారి వెన్ను విరిచినట్లేనని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ సమాజం ఉమ్మడిగా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు.

Videos

రాజ్ తో సమంత రిలేషన్‌ను బయటపెట్టేసిన సీనియర్ నటి..!

అల్లు అర్జున్ తో నిహారిక లవ్ స్టోరీ

కమ్మేస్తోన్న కరోనా కాటేరమ్మ కొడుకునూ వదలని వైరస్

సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నికలో టీడీపీకి ఎదురుదెబ్బ

అందాల పోటీల మీదనే కాదు.. ప్రజల ప్రాణాల మీద దృష్టి పెట్టాలి: కేటీఆర్

గుల్జార్ హౌస్ లో అసలేం జరిగింది?

YSRCP కౌన్సిలర్లను కిడ్నాప్ చేసిన టీడీపీ గూండాలు

ISI ఏజెంట్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

పాక్‌కు దెబ్బ మీద దెబ్బ BCCI సంచలన నిర్ణయం

ఓటమి భయంతో YSRCP నేతలపై దాడి

Photos

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : 'సూర్య- వెంకీ అట్లూరి' కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)

+5

కూటమి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై ఆగని దాడులు

+5

కాజల్‌ బర్త్‌డే స్పెషల్‌.. ఆ సినిమాతోనే స్టార్‌డమ్‌ (ఫొటోలు)

+5

23వ 'జీ సినీ అవార్డ్స్'.. ముంబైలో మెరిసిన స్టార్‌ హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (ఫొటోలు)

+5

ట్యాంక్‌ బండ్‌పై అట్టహాసంగా ప్రారంభమైన సండే ఫండే వేడుకలు (ఫొటోలు)

+5

వరంగల్ : సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..(ఫొటోలు)

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు