Breaking News

ఇంట్లోనే ప్రసవించిన మహిళ.. బిడ్డను బాత్‌రూం బకెట్‌లో పెట్టి..

Published on Tue, 04/04/2023 - 21:26

తిరువనంతపురం: కేరళ అలప్పుజలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ నిండు గర్భిణి ఇంట్లోనే ప్రసవించింది. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో తన బిడ్డను ఓ వస్త్రంలో చుట్టి బాత్‌రూంలోని బకెట్‌లో పెట్టి ఆస్పత్రికి వెళ్లింది. ఇంట్లో బకెట్‌లో ఉన్న బిడ్డను కాపాడాలని వైద్యులను కోరింది.

ఆస్పత్రి అధికారులు వెంటనే ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. నవజాత శిశువును కాపాడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసులు హుటాహుటిన బయల్దేరి వెళ్లారు. బాత్‌రూంలో బకెట్‌లో ఉన్న పసికందును బయటకు తీసుకొచ్చారు. తక్షణమే చెన్నగూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.  శిశువు బరువు 1.3 కీజీలు ఉన్నట్లు తెలిపారు.

శిశువును ఆస్పత్రిలో చేర్చిన అనంతరం బాగోగులు చూసుకునే బాధ్యతను పథానంతిట్ట చైల్డ్ వెల్ఫేర్‌ కమిటీకి అప్పగించారు పోలీసులు. వలంటీర్ల సహకారంతో మెరుగైన చికిత్స కోసం చిన్నారిని కొట్టాయం మెడికల్ ఆస్పత్రికి తరలించారు.

అయితే మహిళ ప్రసవించినప్పుడు ఆమె చుట్టుపక్కల ఎవరూ లేనట్లు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావం కావడంతో బిడ్డను పట్టుకునే శక్తి లేక బకెట్‌లోనే పెట్టి చెన్నగూర్ ఆస్పత్రికి వెళ్లి అడ్మిట్ అయింది. జరిగిన విషయాన్ని అక్కడి అధికారులకు చెప్పింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం.
చదవండి: ప్రియుడ్ని చంపి ముక్కలు ముక్కలుగా నరికిన ప్రియురాలు.. 400 కిలోమీటర్లు తీసుకెళ్లి బీచ్‌లో..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)