Breaking News

వాహనదారులకు షాక్.. పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 సెస్..ఎక్కడంటే?

Published on Fri, 02/03/2023 - 15:50

తిరువనంతపురం: వాహనదారులకు కేరళ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.2 సెస్ విధించనున్నట్లు తెలిపింది. ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ బడ్జెట్ ప్రసంగంలో గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. కేరళలో ఎల్‌డీఎఫ్ రెండో దఫా అధికారం చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన రెండో పూర్తి స్థాయి బడ్జెట్ ఇది.

రాష్ట్రంలో ఇకపై సోషల్ సెక్యూరిటీ  సెస్ పేరుతో లీటరు పెట్రోల్, డీజిల్‌పై రూ.2 అదనంగా వసూలు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. తద్వారా సోషల్ సెక్యూరిటీ సీడ్ ఫండ్‌కు రూ.750 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు.

అలాగే భారత్‌లో తయారయ్యే విదేశీ లిక్కర్ బ్రాండ్ మద్యంపై రూ.20, రూ.40 సెస్ విధించనున్నట్లు బాలగోపాల్ వెల్లడించారు. రూ.500-999 ధర గల లిక్కర్ బాటిళ్లపై రూ.20 సెస్, ధర రూ.1000కి ఎక్కువగా ఉండే బాటిళ్లపై రూ.40 సెస్ విధించనున్నట్లు చెప్పారు.  దీనిద్వారా రూ.400 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు.

కేరళ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇంధనం, మద్యంపై సెస్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంవత్సరం రాష్ట్రానికి ఆర్థిక అవరోధాలు ఉన్నప్పటికీ అప్పుల ఊబిలో కూరుకుపోలేదని మంత్రి తెలిపారు.
చదవండి: వాహనదారులకు బంపర్ ఆఫర్.. చలాన్లపై 50 శాతం డిస్కౌంట్..!

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)