Breaking News

Kerala: రూ.100 కోట్ల ముడుపుల కలకలం

Published on Fri, 11/08/2024 - 05:55

తిరువనంతపురం: కేరళలోని ఎన్‌సీపీ (శరద్‌)కి చెందిన ఏకైక ఎమ్మెల్యే థామస్‌ కె.థామస్‌ అధికార ఎల్డీఎఫ్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున ఇవ్వజూపారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జనాధిపత్య కేరళ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆంటోనీ రాజు, రివల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ(లెనినిస్ట్‌) ఎమ్మెల్యే కొవూర్‌ కుంజుమోన్‌లకు థామస్‌ ఈ ఆఫర్‌ ఇచ్చారని అంటున్నారు. ఈ రెండు పార్టీలు ఎల్డీఎఫ్‌లో భాగస్వాములు. 

ప్రతిగా ఈ ఎమ్మెల్యేలిద్దరూ ఎన్‌సీపీ(అజిత్‌)లో చేరడం, పినరయి విజయన్‌పై ఒత్తిడి తెచ్చి కేబినెట్‌లో స్థానం దక్కించుకునేందుకు పథక రచన జరిగిందని ఆరోపణలున్నాయి. జూన్‌ 5న థామస్‌ నుంచి ఈ మేరకు తమకు ప్రతిపాదన వచి్చందని మాజీ మంత్రి కూడా అయిన రాజు సీఎం విజయన్‌ చెవిన వేశారు. దీనిపై ఆయన కుంజుమోన్‌ను ప్రశ్నించగా అలాంటిదేమీ లేదంటూ కొట్టిపారేశారు.

 ఈ వ్యవహారం అక్టోబర్‌ 25న త్రిసూర్‌లో జరిగిన సీపీఎం సమావేశం సందర్భంగా బయటకు వచి్చంది. ఎల్డీఎఫ్‌ మిత్ర పక్షం ఎన్‌సీపీ(శరద్‌)వర్గం ఎమ్మెల్యే థామస్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోడానికి గల కారణాలను ఈ సమావేశంలో సీఎం విజయన్‌ చెప్పినట్లు కూడా తెలుస్తోంది. వాస్తవానికి థామస్‌ కేబినెట్‌లో అటవీ శాఖను కోరుతున్నారు. అయితే, సీఎం విజయన్, సీపీఎంతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్న మంత్రి శచీంద్రన్‌ ఆ శాఖను వదులుకునేందుకు ససేమిరా అంటున్నారు. అందుకే, ఒక రకంగా సీఎం విజయన్‌పై ఒత్తిడి తేవడం ద్వారా కేబినెట్‌లో చేరేందుకు థామస్‌ వేసిన పథకంగా భావిస్తున్నారు. 

ఎన్‌సీపీ(అజిత్‌), బీజేపీలు మహారాష్ట్రలో మిత్రపక్షాలే కాబట్టి.. ఈ పథకమే ఫలించి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్‌సీపీ(అజిత్‌)లో చేరితే కేరళలో బీజేపీకి పరోక్షంగా లాభం కలిగి ఉండేది. ఏదేమైనప్పటికీ, మంత్రి వర్గంలో చేరే అవకాశాన్ని ప్రస్తుతానికి థామస్‌ కోల్పోయినట్లుగానే భావిస్తున్నారు. ఈ పరిణామాలపై తమకెలాంటి సంబంధం లేదని కేరళలో ఎన్‌సీపీ(అజిత్‌)నేత మహ్మద్‌ కుట్టి స్పష్టం చేశారు. ఆరోపణలపై విచారణకు ఏర్పాటైన ఎన్‌సీపీ(శరద్‌)కమిటీ ఎదుట ఇటీవల థామస్‌ హాజరై, ముడుపుల వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కమిటీ త్వరలోనే ఎన్‌సీపీ(శరద్‌) జాతీయ  వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ పీసీ చాకోకు నివేదిక ఇవ్వనుంది.    
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)