Breaking News

కారు ఓనర్‌కి పోలీసుల షాక్‌.. అంబులెన్స్‌కి దారి ఇవ్వలేదని..

Published on Sun, 11/17/2024 - 12:11

తిరువనంతపురం: కేరళలో అంబులెన్స్‌కి దారి ఇవ్వనందుకు ఓ కారు యజమానికి పోలీసులు షాక్‌ ఇచ్చారు. రూ.2.5 లక్షల జరిమానా విధించడంతో అతని లైసెన్స్‌ను కూడా పోలీసులు రద్దు చేసినట్లు సోషల్‌ మీడియాలో ఓ వీడియో హల్‌ చల్‌ చేస్తోంది.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌కు కారు యాజమాని దారి ఇవ్వలేదు. పేషెంట్‌ని అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్చాల్సి రావడంతో అంబులెన్స్‌ డ్రైవర్‌ సైరన్‌ మోగిస్తూనే ఉన్నారు. దాదాపు అన్ని వాహనాలు దారి ఇవ్వగా.. మారుతీ సియాజ్ కారు నడుపుతున్న ఓ వ్యక్తి మాత్రం దారి ఇవ్వలేదు. అయితే, కారు యజమాని ఉద్దేశపూర్వకంగానే అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదని స్పష్టమవుతోంది.

అయితే, అంబులెన్స్ ముందు కూర్చున్న వైద్య సిబ్బంది వీడియో రికార్డ్ చేయగా, ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు వెంటనే స్పందిస్తూ..  నేరుగా ఆ కారు యాజమాని  ఆచూకీ తెలుసుకుని ఇంటికెళ్లారు. రూ.2 లక్షల జరిమానా విధించడంతో పాటు అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ వీడియో గురించి ఎలాంటి  అధికారిక ప్రకటన అందుబాటులో లేవు.

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)