Breaking News

రాంగ్ రూటులో వచ్చి అంబులెన్సును ఢీకొట్టిన మంత్రి కాన్వాయ్ 

Published on Fri, 07/14/2023 - 20:12

తిరువనంతపురం: మంత్రి కాన్వాయ్‌లోని వాహనం వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో పేషెంట్‌ను తీసుకుని వెళ్తోన్న అంబులెన్స్‌ తిరగబడింది. అందులో ఉన్న పేషెంట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రెండు వాహనాల డ్రైవర్ల మీద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు తిరువనంతపురం పోలీసులు. 

కేరళ రాజధానిలోని బిజీ కూడలిలో రెడ్  సిగ్నల్ పడటంతో విద్యాశాఖ మంత్రి వి. శివన్ కుట్టి కాన్వాయ్ రాంగ్ రూట్లో వచ్చింది. అక్కడి ట్రాఫిక్ పోలీసులు మంత్రి కాన్వాయ్‌కు దారిచ్చేందుకు ట్రాఫిక్స్‌ను మళ్లించే ప్రయత్నం చేశారు. అంతలో అటుగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో పేషెంటును ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్‌ సరైన దారిలోనే వచ్చింది. 

కానీ రోడ్డు మధ్యలో ఒక బైకు ఆగి ఉండడంతో దానిని తప్పించుకుని వెళ్ళింది. అది గమనించని మినిస్టర్ కాన్వాయ్ వాహనం అంబులెన్సును బలంగా ఢీకొట్టింది. వెంటనే అంబులెన్స్ పల్టీ కొట్టింది. అదృష్టావశాత్తు అక్కడే ఉన్న పోలీసు తృటిలో పెను ప్రమాదాన్ని తప్పించుకున్నారు.

కాన్వాయ్ వాహనం తర్వాత మోటార్ సైకిల్ను ఢీకొట్టింది. దీంతో వారు కూడా ప్రమాదం నుండి తప్పించుకున్నారు. కానీ అంబులెన్స్‌లోని పేషెంటుకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు అక్కడి పోలీసులు. మంత్రి కాన్వాయ్ వాహనాన్నినడిపిన డ్రైవరును అంబులెన్స్ డ్రైవరును ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. 

ఇది కూడా చదవండి: కునో పార్కులో మరో చిరుత మృతి.. ఇక మిగిలినవి పదే!

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి