Breaking News

నా పై దాడికి సీఎం కుట్ర: గవర్నర్‌ సంచలన ఆరోపణలు

Published on Tue, 12/12/2023 - 09:34

తిరువనంతపురం: కేరళ సీఎం పినరయి విజయన్‌పై ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం తనపై భౌతిక దాడి చేయించి గాయపరిచేందుకు కుట్ర పన్నారన్నారు. ఢిల్లీ వెళ్లేందుకుగాను తిరువనంతపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న గవర్నర్‌ వాహనాన్ని ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తల వాహనాలు ఢీ కొన్నాయి. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అనంతరం కోపంగా కారు నుంచి బయటికి వచ్చిన గవర్నర్‌ ఈ ఘటన వెనుక సీఎం విజయన్‌ కుట్ర ఉందని ఆరోపించడం సంచలనం రేపింది. 

‘ఒకవేళ సీఎం కాన్వాయ్‌ వెళ్తుంటే మధ్యలో వేరే వాళ్ల కార్లు రావడానికైనా అనుమతిస్తారా..? సీఎం కారు సమీపంలోకి మరో కారును రానిస్తారా..? కానీ నా విషయంలో ఏం జరిగింది..? ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు నా కాన్వాయ్‌ వెళ్లే దారిలో కారల్లో వచ్చి నల్ల జెండాలు ప్రదర్శించారు. నా కారును ఇరువైపుల నుంచి వారి కార్లతో ఢీ కొట్టారు.

ఇదంతా జరుగుతుండగా పోలీసులు వారిని కార్లలోపలికి నెట్టారు. దీంతో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు అక్కడి నుంచి పారిపోయారు. ఇది చేయించింది కచ్చితంగా సీఎం విజయనే. గూండాలను పంపి నాపై దాడికి కుట్ర పన్నారు. తిరువనంతపరం రోడ్లు గుండాల ఆధీనంలోకి వెళ్లాయి. ఒకవేళ సీఎం నాతో విభేదించాలనుకుంటే విభేదించవచ్చు.నాపై దాడి చేయాల్సిన అవసరం లేదు. కేరళలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయి’ అని గవర్నర్‌ ఖాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఇదీచదవండి..రాహుల్‌పై ప్రణబ్‌ ముఖర్జీ ఆగ్రహించారా..?   

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)