Breaking News

18 నెలల చిన్నారికి గుండెపోటా? వైద్యుడిపై కేసు

Published on Sat, 07/11/2026 - 14:54

కేరళలోని కన్నూర్‌లో ఒక ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ ఏకైక కుమారుడు, 18 నెలల చిన్నారి  కన్నుమూశాడు  అంటూ కుటుంబ సభ్యులు ఆరోపించడం కలకలం రేపింది. దీంతో పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.

కన్నూర్‌లోని ఎరమామ్-కుట్టూర్ నివాసులైన టి. సూరజ్, విజయషాల ఏకైక కుమారుడు  ఏడాదిన్నర బాలుడు దేవాన్ష్ శౌర్య. జూలై 5న ఇంటి బయట ఆడుకుంటుండగా కిందపడి పెదవికి గాయమైంది. తొలుతు  బాలుడిని మాతమంగళంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.ఆ తర్వాత అతడిని పయ్యన్నూర్‌లోని బేబీ మెమోరియల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ అనస్థీషియా ఇచ్చి గాయానికి కుట్లు వేశారు. ఆ తర్వాత అతను స్పృహ కోల్పోయినట్లు సమాచారం.

పరిస్థితి మరింత విషమించడంతో అనంతరం కన్నూర్‌లోని బేబీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించగా, శుక్రవారం రాత్రి సుమారు 9 గంటలకు శౌర్య ప్రాణాలు విడిచాడు. అనస్థీషియా ఇచ్చిన తర్వాత స్పృహ కోల్పోయి, తమ బిడ్డ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.  డాక్టర్ అంజలి పొడువాల్‌ నిర్లక్ష్యమే తమ బిడ్డ చావుకు కారణమని వాపోయారు. 


అయితే ఈ ఆరోపణలను ఆసుపత్రి ఖండించింది. అనస్థీషియా ఇచ్చిన వెంటనే ఆ బిడ్డకు ఊహించని విధంగా గుండెపోటు వచ్చింది. వెంటనే వెంటిలేటర్‌పై ఉంచి, మెరుగైన క్రిటికల్ కేర్ కోసం తమ కన్నూర్ ఆసుపత్రికి తరలించామని  యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. సరైన మోతాదులో అనస్థీషియా ఇచ్చినా, సరైన వైద్య సంరక్షణ అందించినా సమస్యలు తలెత్తవచ్చని ఆసుపత్రి పేర్కొంది. బిడ్డ ప్రాణాలను కాపాడటానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేశామని ఆసుపత్రి వాదిస్తోంది.   ప్రస్తుతం దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. 
 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)