Breaking News

సీఎం పినరయి విజయన్‌ కీలక నిర్ణయం .. ‘కేరళ’ రాష్ట్రం పేరును మారుస్తూ తీర్మానం

Published on Mon, 06/24/2024 - 22:05

తిరువనంతపురం : కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం పేరును మారుస్తూ సీఎం పినరయి విజయన్ అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టారు. అందుకు అధికార ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్షాలు మద్దతు పలికాయి.

ఈ తీర్మానాన్నిరాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపుతుంది. కేంద్రం అనుమతి ఇస్తే త్వరలో కేరళ కాస్త.. కేరళంగా మారనుంది. అందుకు త్వరలో విధివిధానాలు అమలు కానున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది కేరళ ప్రభుత్వం రాష్ట్రం పేరును మార్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కానీ కొన్ని టెక్నికల్‌ అంశాల కారణంగా కేంద్రం అందుకు ఒప్పుకోలేదు.

తాజాగా, మరోసారి రాష్ట్రం పేరును మార్చే ప్రతిపాదనను సీఎం విజయన్‌ తెరపైకి తెచ్చారు. అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని మలయాళంలో కేరళ అని పిలిచేవారని, మలయాళం మాట్లాడే వారి కోసం ఐక్య కేరళను ఏర్పాటు చేయాలనే డిమాండ్ స్వాతంత్ర్య పోరాట కాలం నుంచి బలంగా ఉందని సీఎం చెప్పారు.

రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో తమ రాష్ట్రం పేరు కేరళ అని రాసి ఉందని, దానిని కేరళంగా సవరించాలని కేంద్రాన్ని కోరారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భాషల్లో ‘కేరళ’ పేరును ‘కేరళం’ మార్చడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మానం చేసినట్లు  చెప్పారు.

అంతేకాదు భారత రాజ్యంగంలో ఆర్టికల్‌ 3 కింద కేరళ పేరును కేరళంగా మార్చాలని, అందుకు రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా మద్దతు పలికిందని కేరళ సీఎం పినరయి విజయన్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)