Breaking News

బెయిల్‌ నిలిపివేతపై సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్‌

Published on Sun, 06/23/2024 - 19:31

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీ లాండరింగ్‌ (ఈడీ)కేసులో తనకు ట్రయల్‌కోర్టు ఇచ్చిన బెయిల్‌ ఆర్డర్‌ మీద హైకోర్టు స్టే ఇవ్వడంపై ఢిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) చీఫ్‌ కేజ్రీవాల్‌ ఆదివారం(జూన్‌23) సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సోమవారం(జులై24) ఉదయమే పిటిషన్‌ను విచారించాలని కేజ్రీవాల్‌ న్యాయవాదులు కోర్టును విజ్ఞప్తి చేశారు. కాగా, జూన్‌20న ఈ కేసులో ట్రయల్‌కోర్టు ఇచ్చిన బెయిల్‌పై 21న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు విచారణ చేపట్టి అదే రోజు స్టే ఇచ్చింది. పిటిషన్‌పై తుది తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. ఈ లోపే కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.   

కాగా, లి‌క్కర్‌ స్కామ్‌ కేసులో  కే జ్రీవాల్‌ను ఈడీ ఈ ఏడాది మార్చిలో అరెస్టు చేసింది. అనంతరం ఆయనకు లోక్‌సభ ఎన్నికల వేళ సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో  కేజ్రీవాల్‌ ఎన్నికల ప్రచారంలో  పాల్గొన్నారు. 

అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌ పొడిగించాలని తిరిగి కేజ్రీవాల్‌ సుప్రీంను ఆశ్రయించగా కోర్టు నిరాకరించింది. ట్రయల్‌ కోర్టుకు వెళ్లి రెగ్యులర్‌ బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని అత్యున్నత న్యాయ స్థానం సూచించింది. 

వెంటనే కేజ్రీవాల్‌ ట్రయల్‌ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ వేశారు. అయితే కోర్టు తీర్పు రిజర్వు చేయడంతో ఆయన తిరిగి తీహార్‌ జైలులో లొంగిపోవాల్సి  వచ్చింది.

తాజాగా కేజ్రీవాల్‌కు బెయిల్‌ ఇస్తూ  ట్రయల్‌  కోర్టు తీర్పు వెలువరించింది. ఈ ఆనందం ఎక్కువ సేపు నిలవకుండా ఈడీ బెయిల్‌ రద్దు పిటిషన్‌ వేయడంతో హై కోర్టు కేజ్రీవాల్‌ బెయిల్‌పై స్టే ఇచ్చింది.          

 

 

 

 

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)