Breaking News

యమున నీటిని తాగే దమ్ముందా?..ఈసీకి కేజ్రీవాల్‌ సవాల్‌

Published on Thu, 01/30/2025 - 15:40

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘానికి ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్‌ ఆద్మీ కన్వీనర్‌ సవాల్‌ విసిరారు. ఇప్పుడే నేను మీకు ఓ మూడు బాటిళ్ల యమునా నది నీటిని పంపిస్తా. ప్రెస్‌ మీట్‌ పెట్టండి. ఆ ప్రెస్‌మీట్‌లో ఆ నీటిని తాగండి. అలా చేస్తే .మేం తప్పు చేశామని ఒప్పుకుంటామని స్పష్టం చేశారు.

హర్యానా ప్రభుత్వం యమునా నధిలోకి వ్యర్థాలను వదులుతోందని క్రేజీవాల్‌ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై స్పందించిన ఈసీ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటల కల్లా వివరణ ఇవ్వాలని సూచించింది. అయితే ఈసీ నిర్ణయంపై కేజ్రీవాల్‌ గురువారం మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో ఓ మూడు బాటిళ్ల యమునా నది నీటిని ఉంచారు.

 

ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బుల్ని వెదజల్లుతున్నాయి. కానీ వాటిని ఈసీఐ గుర్తించడం లేదు. రాజకీయాలు చేయడంలో బిజీగా ఉంది. ఎందుకంటే? కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ త్వరలో రిటైర్‌ కాబోతున్నారు. రిటైర్‌మెంట్‌ తర్వాత రాజకీయాలు చేయానుకుంటున్నారేమో? ఈ సందర్భంగా చరిత్ర ఎప్పటికీ క్షమించదని ఈసీఐకి గుర్తు చేస్తున్నాను.

ఎన్నికల కమిషన్‌ను నేను నమ్మును. ఈసీఐ ఎప్పుడో అపఖ్యాతి పాలైంది. త్వరలో అరెస్టు అవ్వొచ్చు. అయినా నేను భయపడను. దేశంలో ఇంతకుముందెన్నడూ ఇలాంటి ఎన్నికలు జరగలేదు.

‘అమ్మోనియా స్థాయి 7 పీపీఎం ఉన్న మూడు యమునా నది వాటర్‌ బాటిళ్లను కేంద్ర ఎన్నికల సంఘానికి, కమిషనర్‌కు పంపుతా. ఆ నీటిని ముగ్గురు ఎన్నికల కమిషనర్లు మీడియా సమావేశంలో తాగాలి. అలా తాగితే మేము మా తప్పును ఒప్పుకుంటాము’అని కేజ్రీవాల్‌ అన్నారు.

అమోనియం స్థాయి పెరిగి
కేజ్రీవాల్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. యమునా నది నీరు విషపూరితంగా మారుతున్న సంగతి నిజమేనని, ఈ నీటిలో అమ్మోనియం స్థాయి ఇటీవల విపరీతంగా పెరుగుతోందని కేజ్రీవాల్‌ చెప్పారు. ఢిల్లీలోని నీటి శుద్ధి కేంద్రాలు సక్రమంగా పనిచేయకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నది నీటిలో అమ్మోనియా స్థాయి 7 పీపీఎం ఉందన్నారు.

ఇది కచ్చితంగా విషంతో సమానమేనని అన్నారు.  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీలకు యమునా నది నీటిని ప్రజల సమక్షంలో బహిరంగంగా తాగే దమ్ముందా? అని సవాలు విసిరారు. ఎగువ రాష్ట్రంలో హర్యానాలో ఈ నదిలో విషపదార్థాలు కలుస్తున్నాయని మరోసారి ఆరోపించారు. అక్కడి బీజేపీ ప్రభుత్వం నదిని విషతుల్యం చేస్తోందన్నారు.

కేజ్రీవాల్‌కు కోర్టు సమన్లు
యమున నదిలో విషం కలుపుతున్నారంటూ కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలపై హర్యానా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్యానా ప్రభుత్వంపై ఆయన చేసిన ఆరోపణలను తప్పుపట్టింది. ఫిబ్రవరి 17వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ బుధవారం కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. యమునా నదిని హర్యానా ప్రభుత్వం విషతుల్యం చేస్తున్నట్లు ఆధారమేంటో చెప్పాలని, నివేదిక సమర్పించాలని స్పష్టంచేసింది.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)