Breaking News

కేదార్‌నాథ్‌ యాత్రలో విషాదం.. ముగ్గురు మృతి

Published on Sun, 07/21/2024 - 11:09

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి నడక మార్గంలో నేటి ఉదయం (ఆదివారం) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండలపై నుంచి పడిన రాళ్ల కారణంగా ముగ్గురు యాత్రికులు మృతిచెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకూ శిథిలాల నుంచి ముగ్గురు యాత్రికుల మృతదేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరంతా మహారాష్ట్రకు చెందిన వారని సమాచారం. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. కేదార్‌నాథ్ యాత్రా మార్గం సమీపంలో కొండపై నుండి పడుతున్న రాళ్ల కారణంగా  కొందరు యాత్రికులు మృతిచెందారన్న వార్త చాలా బాధ కలిగిందని సీఎం పేర్కొన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులకు సూచనలు జారీ చేశారు.

జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వార్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం 7.30 గంటలకు కేదార్‌నాథ్ యాత్రా మార్గంలోని చిర్బాసా సమీపంలోని కొండపై నుండి పడిన భారీ రాళ్ల కారణంగా యాత్రికులు సమాధి అయినట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. వెంటనే ఎన్‌డిఆర్‌ఎఫ్, డిడిఆర్, వైఎంఎఫ్ అడ్మినిస్ట్రేషన్ బృందంతో సహా యాత్రా మార్గంలోని భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారన్నారు. రెస్క్యూ టీమ్ శిథిలాల నుంచి ముగ్గురి మృతదేహాలను బయటకు తీసిందని, గాయపడిన ఎనిమిది మందిని ఆస్పత్రికి తరలించారని తెలిపారు. 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)