కేదార్‌నాథ్‌ విపత్తు: 18 రోజులు దాటినా లభించని 17 మంది ఆచూకీ

Published on Sun, 08/18/2024 - 08:11

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో భారీ వర్షాల కారణంగా ఘోర విపత్తు సంభవించింది. ఈ ఘటన జరిగి 18 రోజులు దాటినా ఈ విపత్తులో చిక్కుకున్న 17 మంది జాడ ఇంకా తెలియరాలేదు. సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ టీమ్‌కు ఇప్పటి వరకూ ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయి. వీటిలో ఆరు మృతదేహాలను గుర్తించారు. కాగా ఈ విపత్తులో 23 మంది  గల్లంతైనట్లు సోన్‌ప్రయాగ్ పోలీస్ స్టేషన్‌లో  కేసు నమోదైంది.

నేటికీ ఆచూకీ తెలియని 17 మందిలో యాత్రికులతో పాటు స్థానికులు కూడా ఉన్నారు. వీరి ఆచూకీ కోసం గౌరీకుండ్-కేదార్‌నాథ్ కాలినడక మార్గంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. జూలై 31న రాత్రి భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో కేదార్‌నాథ్ నడక మార్గం  రాళ్లతో మూసుకుపోయింది. ఈ సమయంలో చాలా మంది ఆ రహదారిలో చిక్కుకుపోయారు. నాటి నుంచి రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది.  

తాజాగా లించోలిలో శిథిలాలు, రాళ్ల కింద ముగ్గురు మృతదేహాలను కనుగొన్నారు. వీరిని ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నివాసితులు సుమిత్ శుక్లా (21), చిరాగ్ గుప్తా (20), న్యూ మాండ్లోయ్‌ నివాసి నిఖిల్ సింగ్ (20)గా గుర్తించారు. ఈ మృతదేహాలకు జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు.

Videos

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)