Breaking News

రూ. 25 ల‌క్ష‌ల ప్ర‌శ్న‌.. ఆన్స‌ర్ తెలుసా?

Published on Fri, 10/24/2025 - 18:24

భారతదేశంలోని అజ్మీర్‌లోని మాయో కళాశాలలో 1920లలో చ‌దివి, 1932 నుంచి 1970 వరకు ఒమన్‌ను పాలించిన సుల్తాన్ ఎవ‌రు?

ఎ. తైమూర్ బిన్ ఫైసల్ 
బి. హైతం బిన్ తారిక్
సి. సయీద్ బిన్ తైమూర్
డి. తుర్కి బిన్ సయీద్

దిగ్గ‌జ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ వ్యాఖ్యాత‌గా కొన‌సాగుతున్న కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తిలో (Kaun Banega Crorepati) అడిగిన 25 ల‌క్ష‌ల రూపాయ‌ల ప్ర‌శ్న ఇది. త‌న ముందు హాట్‌సీట్‌లో కూర్చున్న శివ చోహాన్‌ను ఆయ‌న ఈ ప్ర‌శ్న అడిగారు. ఇంత‌కీ ఆయ‌న స‌మాధానం చెప్పారా, రూ.25 ల‌క్షలు గెలుచుకున్నారా అనేది తెలుసుకోవాల‌నుకుంటున్నారా?

ప్ర‌స్తుతం కేబీసీ 17 సీజ‌న్ (KBC 17) న‌డుస్తోంది. చాలా మంది ఇందులో పాల్గొని త‌మ ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఇండోర్‌కు చెందిన శివ చోహాన్‌ను షోలో పాల్గొన్నారు. ఏటీఎం అథ‌రైజ‌ర్‌గా ప‌నిచేస్తున్న ఆయ‌న త‌న జీవితంలో ఎదుర్కొన్న క‌ష్టాల‌ను, ఆర్థిక ఇక్క‌ట్ల‌ను వివ‌రించారు. చ‌దువుకుంటూనే కూర‌గాయ‌లు అమ్మాన‌ని, ఏటీఎంలో పనిచేశాన‌ని చెప్పారు. పుస్త‌కాలు అమ్మ‌డం తాను చేసిన మొద‌టి ఉద్యోగ‌మ‌ని.. పుస్త‌కాల కార‌ణంగానే తాను కేబీసీలో కనిపించగలిగానని వెల్ల‌డించారు. ట్యూషన్‌కు డ‌బ్బు లేక‌పోవ‌డంతో శివ చోహాన్ త‌న‌కు ట్యూట‌ర్‌గా మారాడ‌ని ఆయ‌న సోద‌రి చెప్పారు.

కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తిలో గెలిచిన డ‌బ్బుల‌తో ఏంచేస్తార‌ని అమితాబ్ ప్ర‌శ్నించగా.. ''నా త‌ల్లి ఆరోగ్యం కోసం వెచ్చిస్తాన‌ని శివ చోహాన్ స‌మాధాన‌మిచ్చారు. గ‌తంలో ఇంట్లో జరిగిన ఒక విషాదక‌ర ఘ‌ట‌న‌ కారణంగా మా అమ్మ‌కు 80 శాతం కాలిన గాయాలు అయ్యాయి. అమ్మ‌కు ఆప‌రేష‌న్ చేయాల‌ని డాక్ట‌ర్లు చెప్పారు. కానీ అప్ప‌ట్లో మా వ‌ద్ద అంత డ‌బ్బు లేదు. స‌రైన చికిత్స చేయించ‌క‌పోవ‌డంతో అమ్మ ఆరోగ్యం క్షీణించింది. గుండె సంబంధిత స‌మ‌స్య‌లు కూడా మొద‌ల‌య్యాయి. కేబీసీలో నేను ఎంత ప్రైజ్‌మ‌నీ గెలిచినా అదంతా అమ్మ చికిత్స కోస‌మే ఖ‌ర్చుపెడ‌తాన‌''ని శివ చెప్పారు.

ఇక గేమ్‌లోని ఎంట‌రైన శివ చోహాన్ (Shiva Chohan) ఆడియ‌న్స్‌, లైఫ్‌లైన్ స‌హాయంతో చివ‌ర‌కు ప‌న్నెండున్న‌ర ల‌క్ష‌ల రూపాయ‌లు గెల్చుకున్నాడు. మ‌రో ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పివుంటే అత‌డు 25 ల‌క్ష‌ల రూపాయ‌లు గెలిచేవాడు కానీ, స‌మాధానం తెలియ‌క‌పోవ‌డంతో అక్కడితో నిష్క్ర‌మించాడు. అయితే త‌ర్వాత అత‌డు చేసిన గెస్ స‌రైన స‌మాధానం అని తేలింది. పైన అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం C అని కరెక్టుగానే ఊహించాడు. 

చ‌ద‌వండి: ఇంటికో బెంజ్‌, బీఎండ‌బ్ల్యూ.. కానీ ప‌క్కా ప‌ల్లెటూరు!

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)