Breaking News

కవిత బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా

Published on Tue, 08/20/2024 - 10:00

ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఇవాళ్టి విచారణ సందర్భంగా కవిత బెయిల్‌ పిటిషన్‌కు సీబీఐ కౌంటర్‌ దాఖలు చేయగా. ఈడీ దాఖలు చేయలేదు. దీంతో.. శుక్రవారం లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని ఈడీని కోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్‌లతో కూడిన ధర్మాసనం.

ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిలు ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. జూలై 1న న్యాయస్థానం బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. దాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 12న పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కవితకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని తెలిపింది. 

దీంతో.. ప్రతివాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్‌ 20కి వాయిదా వేసింది. దీంతో ఇవాళ కవిత బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.

కవితకు మళ్లీ నిరాశే!

మరోవైపు కవిత బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి , మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాలు ఢిల్లీకి చేరుకున్నారు.

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్‌ చేసింది. అదే కేసులో ఏప్రిల్ 11న కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే సీబీఐ,ఈడీ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కవిత సుప్రీం కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు..ఈడీ కౌంటర్‌ దాఖలు చేయకపోవడంతో విచారణను వాయిదా వేసింది.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)